🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:46 am Posted by : TELANGANA KERATAM

ధర్మాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం

News Image
ధర్మాజీపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఘనంగా తల్లిదండ్రులు–ఉపాధ్యాయుల సమావేశం
దుబ్బాక, నవంబర్ 05,తెలంగాణ కెరటం :దుబ్బాక మునిసిపాలిటీ ధర్మాజీపేట వార్డు లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయుల సమావేశం (పేరెంట్ –టీచర్ మీటింగ్ ) ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సమావేశంలో విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సమన్వయంతో కృషి చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు.ఈ సందర్భంగా సమావేశ ఎజెండాలోని అంశాలైన విద్యార్థుల హాజరు, ప్రవర్తన, క్రమశిక్షణ, ఎస్ ఏ -ఐ పరీక్షల ఫలితాల సమీక్ష, విద్యార్థుల విద్యా ప్రగతి మరియు ప్రతిభ, పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు ప్రత్యేక మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సూచనలు మరియు అభిప్రాయాలపై అంశాలవారీగా చర్చించడం జరిగింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బి. రవీందర్ ప్రతి అంశాన్ని వివరంగా వివరిస్తూ, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపునకు తల్లిదండ్రుల సహకారం ఎంతో అవసరమని తెలిపారు. పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు మహమ్మద్ సాదత్ అలీ కూడా విద్యార్థుల అభ్యసన ప్రగతి, పరీక్షల సన్నద్ధత మరియు భవిష్యత్తు లక్ష్యాలపై విలువైన సూచనలు అందించారు.అదేవిధంగా, విద్యార్థుల విద్యా ప్రమాణాలను మరింత మెరుగుపరిచి, అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు గత జూలై మాసం నుండి 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం 4:15 గంటల నుండి 5:15 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నట్లు ప్రధానోపాధ్యాయులు తెలిపారు. ఈ ప్రత్యేక తరగతుల ద్వారా విద్యార్థులలో విషయ పరిజ్ఞానం, అభ్యసన సామర్థ్యాలు మరియు పరీక్షల సన్నద్ధతను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని వివరించారు.అదేవిధంగా ఉపాధ్యాయులు తమ తమ తరగతుల విద్యార్థుల ప్రగతి, ప్రతిభ, పరీక్షల ఫలితాలు మరియు మెరుగుపరచుకోవాల్సిన అంశాలను తల్లిదండ్రులకు వివరించారు. తల్లిదండ్రులు కూడా తమ విలువైన అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తూ సమావేశం పట్ల హర్షం వ్యక్తం చేశారు.ఈ సమావేశం ద్వారా పాఠశాల మరియు తల్లిదండ్రుల మధ్య పరస్పర అవగాహన, సమన్వయం మరింత బలపడిందని, విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఇటువంటి సమావేశాలు ఎంతగానో దోహదపడతాయని ప్రధానోపాధ్యాయులు తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ సాదత్ అలీ, పల్లె శ్రీనివాస్ గౌడ్, కే శ్రీకాంత్, పి బాలకిషన్, ఆర్ పద్మావతి, వి శైలజ పిడి, సిహెచ్ చంద్రశేఖర్ జూనియర్ అసిస్టెంట్, సి ఆర్ పి టి నవీన్ కుమార్ , ఏ రేణుక , వి కావ్య, బి దుబ్బరాజం మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
🏠 Home