🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 7:52 am Posted by : TELANGANA KERATAM

ప్రభుత్వ బడుల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలి: నందం గణేష్ బాబు

News Image
(తెలంగాణ కెరటం) ఘట్కేసర్ ప్రతినిధి నవంబర్ 5: ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మాజీ ఎంపీటీసీ నందం గణేష్ బాబు అన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘మన బడులు.. మన బాధ్యత’ కార్యక్రమంలో భాగంగా ఘట్కేసర్ డివిజన్ కొండాపూర్ లోని ప్రాథమిక పాఠశాలకు రంగులు వేయించేందుకు సహకరించిన ఆయనను గురువారం గ్రామస్తులు, ఉపాధ్యాయులు, ఆర్గనైజేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించి రాజ్యాంగ పుస్తకాన్ని బహూకరించారు.ఈ సందర్భంగా గణేష్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వ బడుల బలోపేతానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఇలాంటి మంచి కార్యక్రమాన్ని చేపట్టిన స్ఫూర్తి ఆర్గనైజేషన్ అధ్యక్షుడు కుంటోళ్ల యాదగిరిని అభినందించారు. ఈ సందర్భంగా ఆర్గనైజేషన్ అధ్యక్షుడు యాదయ్య మాట్లాడుతూ ముందుగా సహకరించిన నందం గణేష్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలను సమాజ భాగస్వామ్యంతో ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు ముల్లి జంగయ్య యాదవ్, మాజీ సర్పంచ్ డక్కి రమేష్, ఆర్గనైజేషన్ ప్రతినిధులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
🏠 Home