బియ్యం దుకాణాలు, రైస్ మిల్లులో అధికారుల సంయుక్త దాడులు
రెండు దుకాణాల్లో ధరల ట్యాంపరింగ్.. కేసులు నమోదు
సివిల్ సప్లై, తూనికలు, కొలతల అధికారుల సంయుక్త తనిఖీలు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 06 : కోరుట్ల, మెట్ పల్లి పట్టణాల పరిధిలోని బియ్యం హోల్సేల్, రిటైల్ దుకాణాలు, ఒక రైస్ మిల్లును శుక్రవారం జగిత్యాల జిల్లా పౌర సరఫరాల అధికారి జితేందర్ రెడ్డి తూనికలు, కొలతల అధికారులతో కలిసి సంయుక్తంగా విస్తృత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. మార్కెట్లో బియ్యం కృత్రిమ కొరత సృష్టించకుండా, అధిక ధరలకు విక్రయించకుండా చూడటమే లక్ష్యంగా ఈ తనిఖీలు చేపట్టామని అధికారులు తెలిపారు. తనిఖీల్లో వ్యాపార సంస్థలో బియ్యం బస్తాలకు ఉన్న ధరలు కాకుండా ఎమ్మార్పీ లేబుల్ మార్చి, ఎక్కువ ధరలకు అమ్ముతున్న రెండు దుకాణాలపై వ్యాపార సంస్థలపై తూనికలు, కొలతల అధికారులు కేసులు నమోదు చేశారు. తనిఖీల సందర్భంగా డిప్యూటీ తహశీల్దార్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, రెవెన్యు సిబ్బంది దుకాణాలు, గోదాములలో ఉన్న నిల్వలను క్షుణ్ణంగా లెక్కించారు. ధరల పట్టికల ప్రదర్శన, తూకాలు, నిల్వ రిజిస్టర్లను క్షేత్రస్థాయిలో పరిశీలించి, నిబంధనలు పాటించని వ్యాపారులపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ప్రతి షాపు లేదా మిల్లు ఎదుట వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా రోజువారీ నిల్వ వివరాలు, ప్రభుత్వం నిర్ణయించిన విక్రయ ధరల బోర్డును తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ట్రేడ్ లైసెన్స్, జీఎస్టీ, ఆహార భద్రతా లైసెన్స్ పత్రాలు తనిఖీ అధికారులకు చూపించేందుకు సిద్ధంగా ఉంచాలన్నారు. రోజువారీ కొనుగోళ్లు, అమ్మకాల వివరాలను స్టాక్ రిజిస్టర్లో ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, 26 కిలోల బస్తా పేరుతో 24 లేదా 25 కిలోలు విక్రయిస్తే మోసపూరిత కొలతల చట్టం ప్రకారం కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా ఈ తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. తనిఖీల్లో ఎవరైనా వ్యాపారులు అక్రమ నిల్వలకు పాల్పడినా, ధరల ట్యాంపరింగ్ చేసినా, తూకాల్లో తేడాలు చూపినా, రికార్డులు సక్రమంగా లేకపోయినా నిత్యావసర సరుకుల చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.