🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 06 November 2026, 8:06 pm Posted by : TELANGANA KERATAM

అర్హులైన పట్టభద్రులంతా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

News Image
 
చౌదరిగూడలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించిన కాంగ్రెస్ నాయకులు
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 6: ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియలో అర్హులైన ప్రతి ఒక్కరూ తమ పేర్లను నమోదు చేసుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సూచనలు, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి శ్యామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా ఘట్‌కేసర్ మండలంలోని పోచారం డివిజన్ చౌదరిగూడ గ్రామంలో విస్తృత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ యాదవ్ ఆదేశాల మేరకు పోచారం డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కర్ర రాజేష్ నేతృత్వంలో, ఘట్‌కేసర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు కేశపావుల వినోద్ కుమార్ ఆధ్వర్యంలో, చౌదరిగూడ గ్రామ శాఖ అధ్యక్షుడు మంచాల సుధాకర్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియకు చివరి రోజు కావడంతో కాలనీల్లోని విద్యావంతులు, పట్టభద్రులను కలిసి ఓటు నమోదు ప్రాధాన్యతను వివరించారు. అర్హత కలిగిన ప్రతి పట్టభద్రుడు తప్పనిసరిగా తన ఓటును నమోదు చేసుకోవాలని, ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామి కావాలని కోరారు. ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ప్రత్యేకంగా కృషి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ రామ్మోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. పట్టభద్రులు, విద్యావంతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఆయన కృషి చేస్తారని, వారి సమస్యలను సంబంధిత వేదికలపై ప్రస్తావించి న్యాయం జరిగేలా ప్రయత్నిస్తారని నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ వర్కింగ్ ప్రెసిడెంట్ బొజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పులికంటి భాస్కర్ రెడ్డి, బండ్లగూడ నాగేష్ గౌడ్, పోచారం డివిజన్ ఎస్టీ సెల్ నాయకులు శ్రావణ్ నాయక్, కళ్యాణ్ నాయక్‌తో పాటు కాలనీవాసులు నాగరాజు,భద్ర, రఘు, తులసి తదితరులు పాల్గొన్నారు.
🏠 Home