🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 6:58 am Posted by : TELANGANA KERATAM

ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు.. అధికారులను బెదిరించడం సరికాదు

News Image
ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర విమర్శలు.. అధికారులను బెదిరించడం సరికాదు.
-దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి 
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06, తెలంగాణ కెరటం :దుబ్బాక శాసనసభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యవహారశైలిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆయన అధికారులను బెదిరిస్తున్న తీరును దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వచ్చే వరకు ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించవద్దంటూ అధికారులను ఆదేశించడం, బెదిరించడం సరికాదని శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.ఒకవైపు మంత్రి పర్యటన సందర్భంగా నియోజకవర్గంలో పుష్కలంగా నీరు ఉందని, రైతులకు మరింత విద్యుత్ సరఫరా చేయాలని కోరుతూ, మరోవైపు సిద్దిపేటకు వెళ్లి దుబ్బాకను కరువు మండలంగా ప్రకటించాలని కోరడం వెనుక ఉన్న వైరుధ్యాన్ని ఎత్తిచూపారు.కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రైతులకు మేలు జరిగేలా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని తెలిపారు. వ్యాపారులు నేరుగా రైతుల పొలాల వద్దకే వచ్చి ధాన్యం కొనుగోలు చేస్తుండటంతో రైతులకు క్వింటాల్‌కు అదనంగా రూ.100 వరకు లాభం చేకూరుతోందని పేర్కొన్నారు. ఈ పరిణామాలను ఓర్వలేకనే ఎమ్మెల్యే కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.ముత్యంరెడ్డి కుటుంబం గత 40 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో నీతివంతమైన రాజకీయాలు చేస్తూ ప్రజలకు సేవ చేసిందని పేర్కొన్నారు. తమపై చేస్తున్న అవినీతి ఆరోపణల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. ఇకనైనా తన వ్యవహారశైలిని మార్చుకోవాలని, లేనిపక్షంలో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.
🏠 Home