జియో నెట్‌వర్క్ సమస్యతో మద్దూరు ప్రజల అవస్థలు

రీచార్జీలు చేస్తున్నా నాణ్యమైన సేవలు కరువు
సమస్య పరిష్కరించాలని చికిని మహేష్ డిమాండ్
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 6
మద్దూరు: పట్టణంలో జియో నెట్‌వర్క్ సమస్యతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నెలనెలా రీచార్జీల రూపంలో డబ్బులు చెల్లిస్తున్నా కనీస స్థాయిలో కూడా సిగ్నల్ అందడం లేదని చికిని మహేష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ కాల్స్ మధ్యలోనే నిలిచిపోవడం, ఇంటర్నెట్ నత్తనడకన సాగడంతో నిత్యావసర పనులకు ఆటంకం కలుగుతోందన్నారు.అత్యవసర సమయాల్లోనూ ఫోన్ పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వినియోగదారుల నుంచి రీచార్జీల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్న జియో సంస్థ నాణ్యమైన సేవలు అందించకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా సంస్థ ప్రతినిధులు స్పందించి నెట్‌వర్క్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని చికిని మహేష్ డిమాండ్ చేశారు. లేదంటే వినియోగదారులు ఇతర నెట్‌వర్క్‌లకు మారే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు....