🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 7:09 am Posted by : TELANGANA KERATAM

దళితుల భూముల జోలికొస్తే ఊరుకోం

News Image
దళితుల భూముల జోలికొస్తే ఊరుకోం
40 కుటుంబాల జీవనాధారాన్ని కాపాడాలి. ఖాజీపూర్‌ రైతుల డిమాండ్‌తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 6

మద్దూరు ఖాజీపూర్‌: తమకు ప్రభుత్వం కేటాయించిన అసైన్డ్‌ భూములను ఇతర ప్రభుత్వ అవసరాలకు వినియోగించవద్దని ఖాజీపూర్‌ దళిత రైతులు అధికారులను కోరారు. ఈ మేరకు, తహసిల్దార్ మహేష్ గౌడ్ కు,వినతిపత్రం సమర్పించారు. 60–70 ఏళ్ల క్రితం తమ పెద్దలకు కేటాయించిన 6 ఎకరాల 20 గుంటల భూమితో పాటు, మరో 2 ఎకరాల్లో నీలగిరి చెట్ల పెంపకం ద్వారా 40 కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయని తెలిపారు. ఈ భూములను ఇతర అవసరాలకు మళ్లిస్తే తమ బతుకులు రోడ్డున పడతాయని ఆవేదన వ్యక్తం చేశారు. వారసత్వంగా వస్తున్న భూములను తమకే కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వంచర్ల గోపాల్‌, సాయిలు, నారాయణ, రైతులు పాల్గొన్నారు
🏠 Home