🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 7:11 am Posted by : TELANGANA KERATAM

దుబ్బాకలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు

News Image
దుబ్బాకలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోటీలు
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 06,తెలంగాణ కెరటం :విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మక ఆలోచన, పరిశోధనాత్మక ఆసక్తిని పెంపొందించడంతో పాటు వారిలో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించే చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ – 2026 పోటీలకు దుబ్బాక మండలంలో నిర్వహించనున్నారు. శుక్రవారం దుబ్బాకలో చెకుముకి సైన్స్ టాలెంట్ టెస్ట్ పోస్టర్లను ఎంఈఓ ప్రభుదాస్, జడ్పీజిహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు భూపాల్ ఆవిష్కరించారు.సైన్స్ పోటీలను పాఠశాల స్థాయిలో ఈ నెల 12 నిర్వహించే పాఠశాల స్థాయిలో విజేతలైన విద్యార్థులను మండల స్థాయి పోటీలను ఈ నెల 21, ఉదయం 10 గంటలకు TSMS లచ్చపేట (టీఎస్ఎంఎస్)లో నిర్వహించనున్నట్లు నిర్వాకులు తెలిపారు. మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, టిజిఎంఎస్, కేజీబీవీ రెసిడెన్షియల్, ప్రైవేట్ పాఠశాలల నుంచి 8, 9, 10వ తరగతుల ఆంగ్ల మాధ్యమానికి చెందిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున పాల్గొనేలా ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపల్స్, స్పెషల్ ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకోవాలని నిర్వాహకులు కోరారు.పాఠశాల స్థాయిలో విజేతలైన విద్యార్థుల వివరాలను మండల జేవీవీ కన్వీనర్ బుచ్చిబాబుకు అందజేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జేవీవీ జిల్లా ప్రతినిధి మహమ్మద్ సాదత్ అలీ, సీఆర్పీలు నవీన్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.జె వి వి జిల్లా ప్రతినిధి మహమ్మద్ సాదత్ అలీ మాట్లాడుతూవిద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలకు పదును పెట్టి, భావి శాస్త్రవేత్తలను తీర్చిదిద్దే దిశగా చెకుముకి ఒక గొప్ప వేదికన్నారు. ప్రతి పాఠశాల చురుకుగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు.
🏠 Home