హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం
ముఖ్యమైన పాయింట్స్:హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం
హక్కుల పరిరక్షణకు ఐక్య పోరాటం
తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల జంపన్న
ఖమ్మం, నవంబర్ 06: తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ కులాల జాబితాలో చేర్చే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన హక్కులు, రిజర్వేషన్లు మరియు భవిష్యత్తు ప్రయోజనాలను పరిరక్షించాలనే లక్ష్యంతో శుక్రవారం ఖమ్మం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఖమ్మం జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర్ ను ఖమ్మం జిల్లా నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసి మెమొరాండం సమర్పించింది. ఈ సందర్భంగా ముదిరాజ్ సామాజిక వర్గాన్ని బీసీ-ఏ కులాల జాబితాలో చేర్చే ప్రతిపాదనను పునఃపరిశీలించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ బీసీ-ఏ జాబితాలో చేర్చవద్దని, తద్వారా తరతరాలుగా సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన నాయి బ్రాహ్మణ సమాజానికి అన్యాయం జరగకుండా మా అభ్యంతరాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ ను కోరారు. తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఐక్యవేదిక ఖమ్మం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల జంపన్న మాట్లాడుతూ... మన హక్కుల పరిరక్షణ కోసం మనమంతా ఒక్కటిగా నిలబడాలని, ఇది ఎవరి వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్న పోరాటం కాదని సూచించారు. నాయి బ్రాహ్మణ సమాజ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు, అన్ని కుల ఆత్మగౌరవం కోసం చేస్తున్న సమిష్టి కృషి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఐక్యతను చాటిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియకజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు తూముల నాగభూషణం, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆలేటి సత్యనారాయణ, జిల్లా గౌరవ అధ్యక్షులు ఆలేటి వెంకటప్పయ్య, జిల్లా గౌరవ సలహాదారులు లింగంపల్లి అప్పారావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంపాల జంపన్న, రాష్ట్ర కమిటీ సభ్యులు ఓగిరాల వాసు, నగర అధ్యక్షులు సింగారపు చంద్రమౌళి, నగర గౌరవ సలహాదారులు రాసమల్ల నరసింహారావు, సూత్రాల శ్రీనివాసరావు, స్టీరింగ్ కమిటీ సభ్యులు ప్రభాకర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గొల్లపూడి ఉపేందర్, యువ నాయకులు భూపతి, కనకయ్య, కూసుమంచి మండల నాయకులు జంపాల రమేష్, రాజుతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.