🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 7:31 am Posted by : TELANGANA KERATAM

వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. అత్యవసర పనులకు చర్యలు తీసుకుంటాం

News Image
ముఖ్యమైన పాయింట్స్:వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. అత్యవసర పనులకు చర్యలు తీసుకుంటాం
వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత.. అత్యవసర పనులకు చర్యలు తీసుకుంటాం 
 ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 6, నవంబర్12వ వార్డులో రూ.55 లక్షల యు ఐ డి ఎఫ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన
సంగారెడ్డి పట్టణంలోని 12వ వార్డులో ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యం కల్పించేందుకు UIDF నిధుల ద్వారా రూ.55 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ శంకుస్థాపన చేశారు. కౌన్సిలర్ పొన్న రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. కాలనీల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు రాకపోకల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. వార్డుల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో కోటి రూపాయల వరకు అభివృద్ధి పనులు చేపట్టిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రస్తుతం కూడా వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, అత్యవసరంగా చేపట్టాల్సిన పనులకు ప్రాధాన్యతనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇచ్చిన ప్రాధాన్యతతోనే వార్డు అభివృద్ధి పనులను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మాజీ సీడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, డాక్టర్ శ్రీహరి, నవీన్, జీవీ శ్రీనివాస్, విఠల్ ,కిరణ్, ఇంతియాజ్, సందీప్, సంజీవ రావు కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home