🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 5:08 pm Posted by : Kancharala Shivakumar

రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం..! -దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి

News Image
ముఖ్యమైన పాయింట్స్:రైతులకు మద్దతు ధర అందించడమే లక్ష్యం..!-దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి రవి
దుబ్బాక మండలం రాజక్కపేట, చికోడు, గంభీర్ పూర్ , బల్వంతపూర్, పద్మశాలి గడ్డ, నర్లేన్ గడ్డ, హసన్ మిరాపూర్  గ్రామలలో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను దుబ్బాక మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగర రవి,  ఏపిఎం రామకృష్ణ, సిసి లు ఏఈఓ లతో కలసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికే కాంగ్రెస్ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తోందని అన్నారు.రైతులకు ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా కొనుగోలు ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని తెలిపారు. ధాన్యం తూకం,నాణ్యత పరిశీలన, కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆయన పేర్కొన్నారు. వరి కోతలు పూర్తయిన వెంటనే రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధరను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించిన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాల్ రెడ్డి, డైరెక్టర్లు కడదురి నరేందర్ రెడ్డి,మట్ట కిషన్ రెడ్డి, పర్స నర్సింలు, ఎండి అజీజు ఆయా గ్రామాల సర్పంచ్లు పలువురు పాల్గొన్నారు.
🏠 Home