🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 07 November 2026, 6:05 pm Posted by : Kancharala Shivakumar

ఇందిరమ్మ ఇళ్లలో దీపావళి వేడుకలకు ఏర్పాట్లు -గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో సన్నాహక సమావేశం -మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. లలిత కుమారి

News Image
దుబ్బాక,నవంబర్ 07,తెలంగాణ కెరటం :ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల్లో మంజూరై నిర్మాణాలు పూర్తయిన నూతన గృహాల్లో ఈ నెల 8వ తేదీన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ” కార్యక్రమాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదివారం నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి సంబంధించి మండల పరిషత్ కార్యాలయంలో గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులతో మండల పరిషత్ అభివృద్ధి అధికారి డి. లలిత కుమారి సన్నాహక సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కార్యాలయం నుంచి వచ్చిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి పండుగ” స్టిక్కర్లను నవంబర్ 8న నూతన ఇందిరమ్మ ఇళ్లకు అతికించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లబ్ధిదారులతో పాటు గ్రామ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ ప్రముఖులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఎంపీడీఓ డి. లలిత కుమారి కోరారు.
🏠 Home