గాజులరామారంలో దీపావళి నరకాసుర దహనం 3.0 కు ఘన ఏర్పాట్లు
రిపోర్టర్ సతీష్ (తెలంగాణ కెరటం) కుత్బుల్లాపూర్ నియోజకవర్గం
*గాజులరామారం:* ఉషోదయ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని *దీపావళి నరకాసుర దహనం 3.0* కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నారు.
ఈ నెల *08.11.2026 ఆదివారం రోజున సాయంత్రం 06:00 గంటల నుండి* ఉషాముళ్ళపూడి హాస్పిటల్ ప్రక్కన, ఉషోదయ కాలనీ, గాజులరామారంలో ఈ వేడుక జరగనుంది.
ఈ కార్యక్రమంలో రంగు రంగుల బాణాసంచా వెలుగులతో ఆంధ్ర నుండి ప్రత్యేక క్రాకర్స్ షో, సినీ డబ్బింగ్ ఆర్టిస్ట్ లు & జబర్దస్త్ టీమ్ ప్రోగ్రామ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
ఈ వేడుకకు *రాజు ఎంటర్టైనర్స్ - డేవిడ్ రాజు మునుకోటి, ఆర్గనైజర్ సెక్రటరీ* గా వ్యవహరిస్తున్నారు. అసోసియేషన్ ప్రెసిడెంట్ *దేగల సతీష్ బాబు*, జనరల్ సెక్రటరీ *వి. నర్సింహ్మ రెడ్డి* లతో పాటు కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.
కాలనీ వాసులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ఈ వేడుకను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.