రైతు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాం

*రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది*: *ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ*
తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా ప్రతినిధి
సిద్దిపేట రూరల్ మండలంలోని చిన్న గుండవెళ్లి, ఇరుకోడ్, సీతారాంపల్లి, మాచాపూర్ గ్రామాల్లో నేడు ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆత్మ కమిటీ చైర్మన్ పూజల గోపికృష్ణ గారు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...రైతులు కష్టపడి పండించిన ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేసేలా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని అన్నారు.ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటిస్తూ, రైతులకు సకాలంలో గిట్టుబాటు ధర అందేలా చూడాలని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని సూచించారు.రైతుల సంక్షేమం, వ్యవసాయ అభివృద్ధే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొన్నారు.వర్షాలు, వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రైతులు ధాన్యాన్ని జాగ్రత్తగా ఆరబెట్టి, కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా డైరెక్టర్ జనార్ధన్ రెడ్డి.అజ్మత్.మండల అధ్యక్షుడు అంజిరెడ్డి.మహిపాల్ రెడ్డి.పద్మరెడ్డి.రాజు.ఇరుకోడ్ అధ్యక్షుడు మలరెడ్డి.లక్మ రెడ్డి.దుర్గరెడ్డి.బాబు.. ఐకేపీ సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.