గంట వ్యవధిలోనే 10 తులాల బంగారం రికవరీ
గంట వ్యవధిలోనే 10 తులాల బంగారం రికవరీ
బాధితుడికి బంగారం అప్పగించిన బుగ్గారం ఎస్ఐ శ్రీకాంత్
బుగ్గారం: పోలీసుల చాకచక్యం, సమయస్ఫూర్తితో పోగొట్టుకున్న 10 తులాల బంగారం గంట వ్యవధిలోనే తిరిగి బాధితుడికి చేరింది. బుగ్గారం ఎస్ఐ ఎస్. శ్రీకాంత్ చూపిన చొరవపై వెలుగొండ గ్రామ యువకులు అభినందనలు తెలిపారు.
వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మండలానికి చెందిన మూట శంకర్ తన మరదలి వివాహం నిమిత్తం ముంబై నుంచి 10 తులాల బంగారం కొనుగోలు చేసి, బ్యాగులో పెట్టుకొని ధర్మపురికి బయలుదేరాడు. జగిత్యాలలో ధర్మపురి వెళ్లే బస్సు ఎక్కి ప్రయాణిస్తుండగా, వెలుగొండ స్టేజి దాటిన తర్వాత తన బ్యాగు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై డయల్ 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు.
వెంటనే స్పందించిన బుగ్గారం పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ సంపత్ (2177) విషయాన్ని ఎస్ఐ ఎస్. శ్రీకాంత్ దృష్టికి తీసుకెళ్లారు. ఆ సమయంలో సర్కిల్ పెట్రోలింగ్ విధుల్లో ఉన్న ఎస్ఐ శ్రీకాంత్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
వెలుగొండ స్టేజి పరిసరాలతో పాటు గ్రామంలో రాత్రి సమయంలో ఎవరెవరు వచ్చారనే విషయంపై గ్రామ యువకులను ఆరా తీశారు. యువకులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఓ వ్యక్తి ఇంటికి వెళ్లి విచారించగా, అతను తన బ్యాగు అనుకొని మరో బ్యాగును పొరపాటున తీసుకువచ్చినట్లు గుర్తించారు. రెండు బ్యాగులు ఒకే విధంగా ఉండటంతో ఈ పొరపాటు జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు.
ఆ బ్యాగును తనిఖీ చేయగా అందులో చిన్న బ్యాగులో భద్రపరిచిన 10 తులాల బంగారం లభించింది. వెంటనే పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకొని బాధితుడు మూట శంకర్‌ను, ఆయన బావమరిదిని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి బంగారాన్ని వారికి అప్పగించారు.
పోగొట్టుకున్న బంగారాన్ని కేవలం గంట వ్యవధిలోనే గుర్తించి బాధితుడికి తిరిగి అందజేయడంతో ఎస్ఐ శ్రీకాంత్, కానిస్టేబుల్ సంపత్‌లను వెలుగొండ గ్రామ యువకులు అభినందించారు.
పోలీసుల సమయస్ఫూర్తి.. ప్రజలకు భరోసా!