🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 10:53 am Posted by : TELANGANA KERATAM

చదువుల తల్లికి చేయూతనిచ్చిన జనతా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ గోగుల రానా ప్రతాపరెడ్డి

News Image
 గ్రూపు లో ఒక చిన్న పోస్ట్ పెట్టిన వెంటనే రాత్రికి రాత్రే సహృదయంతో స్పందించి ₹12000/- అక్షరాల 12 వేల రూపాయలు చదువుల కొరకు చేయూతనిచ్చిన డాక్టరు గోగుల రాణా ప్రతాప్ రెడ్డి అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు
స్థానిక నర్సంపేట ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ప్రధమ సంవత్సరము చదువుతున్న విద్యార్థినికి కావలసిన టెక్స్ట్ బుక్స్ కొనుక్కోవడానికి ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న CH.KAVYA(KATHARINE) కి సహాయం చేసి భవిష్యత్తులో మొత్తం డాక్టర్ కోర్స్ కు సంబంధించిన అన్ని సంవత్సరాల పుస్తకాలను తానే ఇస్తానని స్వయంగా ఒప్పుకోవడం అమ్మాయికి భరోసానివ్వడం చాలా సంతోషించదగ్గ విషయము అందుకు అన్నగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు* ఇలా పేదరికంలో మగ్గుతున్న అమ్మాయికి వెంటనే స్పందించి జనతా ట్రస్ట్ తన యొక్క దాతృత్వాన్ని చాటుకోవడం సమాజానికి ఒక ఆదర్శవంతంగా ఉన్నారన్నంలో అతిశయోక్తి లేదు.ఈ విధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్న జనతా ట్రస్టు సభ్యులందరికీ పేరుపేరునా ప్రత్యేకమైన ధన్యవాదాలుఈ కార్యక్రమంలో రాణా ప్రతాప్ అన్న దగ్గరికి విషయాన్ని తీసుకెళ్లి సహకరించిన రఘుపతి గారికి, గాదే ఇసాక్ గారికి ధన్యవాదాలు. *జనతా ట్రస్ట్ బాధ్యులు కుంకీస విగ్నేష్ గారు, అచ్చ దయాకర్ గారు, బానోతు రాజేందర్, అంబర బోయిన రాజు మరియు సందీప్   తదితరులు పాల్గొన్నారు
🏠 Home