🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 08 November 2026, 7:33 pm Posted by : Kancharala Shivakumar

18వ వార్డులో ఘనంగా “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” సంబరాలు -18వ వార్డు కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 08, తెలంగాణ కెరటం :రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి , దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆదేశాల మేరకు 18వ వార్డులో “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి” కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాలతో కలిసి వార్డు కౌన్సిలర్ శ్రీరాం సరస్వతి నరేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఆకుల భరత్, వార్డు ఆఫీసర్ సంధ్య, ఆర్పీ విజయలు దీపావళి సంబరాల్లో పాల్గొని లబ్ధిదారుల ఇళ్లలో పండుగ ఆనందాన్ని నింపారు.పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన ప్రజా సంక్షేమానికి నిదర్శనంగా నిలుస్తోంది. ఈ సందర్భంగా లబ్ధిదారుల కుటుంబాల్లో పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
🏠 Home