🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 6:27 am Posted by : TELANGANA KERATAM

కోరుట్లలో ఘనంగా అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ

News Image
కోరుట్లలో ఘనంగా అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ
సంప్రదాయబద్ధంగా గో పూజ, అన్నపూర్ణ మాత పూజ
సుమారు 850 మందికి అన్నప్రసాదం 
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 08 : సనాతన ధర్మ ప్రచార సమితి వారి అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద వితరణ సేవ కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల పట్టణంలోని 07,వ వార్డులోని అర్బన్ కాలనీలో వెంకటేశ్వర ఆలయం, శివాలయం ఆవరణలో ఆదివారం ఆశ్వీయుజ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ సేవ భక్తిశ్రద్ధలతో విజయవంతంగా నిర్వహించారు. స్థానిక వార్డు కౌన్సిలర్ గూగులావత్ శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై, పురోహితులు మనోజ్ కుమార్ చారి వైదిక నిర్వహణలో ముందుగా సామూహిక గోపూజ, తదుపరి అన్నపూర్ణ మాత పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టగా, సుమారు 850 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. కోరుట్ల పట్టణంలో ప్రతి అమావాస్య నాడు పితృదేవతల ప్రీత్యర్థం, లోక కల్యాణం కోసం అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద వితరణ వాట్సాప్ గ్రూప్ సభ్యుల సహకారంతో సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో గత 16 నెలలుగా నిరంతరాయంగా ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరో విశేషంగా పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. అన్నప్రసాద వితరణకు స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు మాత్రమే ఉపయోగించి పర్యావరణ హితమైన సందేశాన్ని సమాజానికి అందించారు. ఈ సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన దాతలు, వాట్సాప్ గ్రూప్ సభ్యులు, సేవాకార్యకర్తలు, భక్తులు, పట్టణ ప్రజలందరికీ నిర్వాహకులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ ప్రచార సమితి అధ్యక్షులు మంచాల జగన్, ప్రధాన కార్యదర్శి బట్టు హరిక్రిష్ణ, కోశాధికారి రేగుంట రాజారాం, అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద వితరణ సేవ ప్రోగ్రాం కమిటీ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, కన్వీనర్ గంప శివ కుమార్, కోశాధికారి మంచాల రమేష్, అన్నపూర్ణ అమావాస్య అన్న ప్రసాద సేవ కమిటీ సభ్యులు పల్లెర్ల మహేందర్, ఆలయ కమిటీ అధ్యక్షులు చిలువేరి అర్జున్, ఉపాధ్యక్షులు పిట్ట రమేష్, కార్యదర్శి ఉషాకోల విజయ్, స్థానిక వార్డు నాయకులు గుద్దెటి రాజేందర్, ఆధ్యాత్మిక సేవకులు రాచమడుగు శ్రీనివాస్ రావు, పడాల వెంకటేశ్వర్ రావు, కోటగిరి మహేష్, ముక్క దామోదర్, కొత్త గణేష్, ఆడెపు నరేష్, తాటికొండ కృష్ణ ప్రహ్లాద్, వనపర్తి రమ్య చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home