మైనర్ల రాష్ డ్రైవింగ్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి.
మైనర్ల రాష్ డ్రైవింగ్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలి..!
బీజేవైఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 08 : కోరుట్ల పట్టణంలో మైనర్ల రాష్ డ్రైవింగ్‌పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని బీజేవైఎం కోరుట్ల పట్టణ అధ్యక్షుడు దమ్మ సంతోష్ రెడ్డి అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోరుట్ల పట్టణంలో రోజురోజుకూ మైనర్ యువకుల ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, అతివేగం, అధిక శబ్దం చేసే మోడిఫైడ్ సైలెన్సర్ల వినియోగం పెరిగిపోతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. రోడ్లపై కొందరు యువకులు ఇష్టానుసారంగా అతివేగంతో వాహనాలు నడుపుతూ, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, దీంతో కోరుట్ల పట్టణ ప్రజలు, పరిసర గ్రామాల ప్రజలు రోడ్లపై వాహనాలు నడపాలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రజలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తోందని పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలని కోరారు. ట్రిపుల్ రైడింగ్, రాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, అధిక శబ్దం చేసే సైలెన్సర్లపై సంబంధిత పోలీస్, రవాణా శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజల ప్రాణాల భద్రతే ముఖ్యం అని, రోడ్లపై భయంలేని ప్రయాణానికి అధికారులు తక్షణమే స్పందించాలన్నారు. ప్రమాదాలు జరిగిన తర్వాత స్పందించడం కంటే, ప్రమాదాలు జరగకముందే అధికారులు అప్రమత్తమై ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని కోరారు.