🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 6:42 am Posted by : TELANGANA KERATAM

ఇందిరమ్మ ఇండ్లలో వెలుగుల దీపావళి.

News Image
ఇందిరమ్మ ఇండ్లలో వెలుగుల దీపావళి.
ప్రతి పేద కుటుంబంలో ఆనందాల వెలుగు.
పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 8):
నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం ఉప్పునుంతల మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు బర్ల పుష్పలత, కృష్ణయ్య నూతన ఇందిరమ్మ ఇంట్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన “మా ఇందిరమ్మ ఇంట్లో దీపావళి”* వేడుకల్లో పాల్గొని, కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించి దీపావళి సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలోటీపీసీసీ ఉపాధ్యక్షులు & అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ పాల్గొన్నారు అనంతరంఈ సందర్భంగా ఏమ్మెల్యే మాట్లాడుతూఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను సాకారం చేస్తున్న తెలంగాణ ప్రజా ప్రభుత్వం ప్రతి ఇంటా వెలుగులు నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని తెలిపారు.ఇందిరమ్మ ఇల్లు ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవం, ఇందిరమ్మ ఇంట్లో దీపావళి ప్రతి గుండెల్లో ఆనందం కలిగిస్తుందని పేర్కొన్నారు.
🏠 Home