🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 6:51 am Posted by : TELANGANA KERATAM

హామీలను అమలు చేయమంటే.. అక్రమ అరెస్టుల

News Image
హామీలను అమలు చేయమంటే.. అక్రమ అరెస్టుల
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 8
మద్దూర్: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడం మానేసి.. ముఖ్యమంత్రి పుట్టినరోజు పర్యటనలు నేపథ్యంలో బిఆర్ఎస్ నాయకులు అరెస్ట్ చేయడం ఏమిటని మండల బిఆర్ఎస్ నాయకులు, కౌన్సిలర్లు ప్రశ్నించారు. మూడు రోజుల కొడంగల్ పర్యటనలో భాగంగా ఆదివారం రోజు మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు గోపాల్, కౌన్సిలర్ దినేష్ నరసింహ, పార్టీ నాయకుడు అంజయ్యను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలు, రైతులకు ఇచ్చిన హామీలు, ఇతర అన్ని వర్గాల ప్రజలకు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైందన్నారు. ఒకవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన తక్షణ చర్యలు సీఎం, మంత్రులు గాలి వదిలేసి.. తన పుట్టినరోజు సందర్భంగా కొడంగల్ లో రైతు మేళ.. పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకోవడం ఏమిటని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి చెప్పుకునే ప్రజా ప్రభుత్వంలో ఏ ఒక్క వర్గం సంతృప్తికరంగా లేదు. దీన్ని గమనించి ఇకనైనా దుబారా ఖర్చులు మానేసి పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది బిఆర్ఎస్ పార్టీ నాయకులను అరెస్ట్ చేసి ప్రజల గొంతును నొక్కాలని చూస్తే రాబోవు రోజుల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది హెచ్చరించారు....
🏠 Home