🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 6:56 am Posted by : TELANGANA KERATAM

గో సేవతో సకల శుభాలు కలుగుతాయి..

News Image
గో సేవతో సకల శుభాలు కలుగుతాయి..
*అమావాస్య రోజున గోసేవ చేస్తే పుణ్యఫలం లభిస్తుంది
*చౌడమ్మగుట్ట శ్రీకృష్ణ గోశాల గోవులకు దాతల గడ్డి దానం**నవదుర్గ కంపెనీ మేనేజర్ భోలా రాం 12000 గడ్డి దానం* 
*గోవులకు గడ్డి, దానం చేసే దాతలు శ్రీ చౌడమ్మ గుట్ట శ్రీకృష్ణగోశాల కు సంప్రదించగలరు*
* షాద్నగర్ నవంబర్ 08 ( తెలంగాణ కెరటం)*హిందూ సంప్రదాయంలో అమావాస్య రోజున గో సేవ చేయడం అత్యంత పుణ్యప్రదంగా, విశేషమైన ఫలితాలను ఇస్తుందని భావిస్తారు. గోమాతకు సేవ చేయడం వలన సకల దోషాలు తొలగిపోతాయని నమ్ముతారు.
హిందూ సంప్రదాయంలో ఆవును 'గోమాత'గా భావించి పూజిస్తారు. గోవును సేవించడం ద్వారా సమస్త దేవతల అనుగ్రహం, అష్టైశ్వర్యాలు, పాప విముక్తి కలుగుతాయని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. 
గో సేవ అనగా ఆవులకు ఆహారం, నీరు అందించడం, వాటిని సంరక్షించడం మరియు గోశాలలను సేవించడం. గోవును పూజించడం ద్వారా మానసిక ప్రశాంతత, ఆరోగ్య లాభాలు మరియు పుణ్యఫలం లభిస్తాయి.  చౌడమ్మగుట్ట శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలోని శ్రీకృష్ణ గోశాలలోని పశువుల కోసం తెచ్చిన గడ్డికి 12000 రూపాయలు.
🏠 Home