🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 09 November 2026, 7:07 am Posted by : TELANGANA KERATAM

అమెరికాలో అనుమానాస్పద స్థితిలో జగిత్యాల జిల్లా యువకుడి మృతి

News Image
అమెరికాలో అనుమానాస్పద స్థితిలో జగిత్యాల జిల్లా యువకుడి మృతి
బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉండగా విషాదం.. రామన్నపేటలో అలుముకున్న విషాదఛాయలు
జగిత్యాల జిల్లా మల్యాల మండల కు చెందిన ఓ యువకుడు అమెరికాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన వెల్మ రిషి రెడ్డి (21) అమెరికాలో మృతి చెందినట్లు సమాచారం.
రిషి రెడ్డి కుటుంబ సభ్యులు సుమారు 25 ఏళ్ల క్రితమే అమెరికాలో స్థిరపడ్డారు. ఇటీవలే రిషి రెడ్డి బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం హాస్టల్ గదిలో విగతజీవిగా కనిపించినట్లు సమాచారం.
యువకుడి మృతి విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. మృతుడి నాయనమ్మ రామన్నపేట గ్రామంలో నివాసం ఉంటుండటంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువస్తారా? లేక అమెరికాలోనే అంత్యక్రియలు నిర్వహిస్తారా? అనే విషయంపై కుటుంబ సభ్యుల నుంచి స్పష్టత రావాల్సి ఉంది. చిన్న వయసులోనే యువకుడు మృతి చెందడంతో గ్రామస్థులు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు.
🏠 Home