🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 5:17 am Posted by : TELANGANA KERATAM

గోదావరి నది జలాలు ఎత్తిపోతల ద్వారా ఏర్గట్ల మండలంలోని గ్రామాలకు అందించాలని

News Image
గోదావరి నది జలాలు ఎత్తిపోతల ద్వారా ఏర్గట్ల మండలంలోని గ్రామాలకు అందించాలని
ప్రజావాణిలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన మూడు దయానంద్ 
 తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 9:

నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల, మండలంలోని తడపాకల్, దొంచందా,గుమ్మిర్యాల్ గ్రామాల శివారులో ప్రవహిస్తున్న గోదావరి నది నుండి ఎత్తిపోతల పథకం ఏర్పాటు చేసి మండల కేంద్రం ఏర్గట్ల తోపాటు మండలంలోని తాళ్లరాంపూర్,తడపాకల్,బట్టాపూర్, తోర్తి గ్రామాలకు నీళ్లు అందించి రైతులకు అండగా నిలబడెలా ఈ విషయాన్ని ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్లాలని సోమవారం జిల్లా కేంద్రం నిజామాబాద్ పట్టణంలోని కలెక్టర్ రేట్ లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా ఉప సర్పంచ్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ మూడ్ దయానంద్ వినతిపత్రంలో విజ్ఞప్తి చేస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటికి విజ్ఞప్తి పత్రాన్ని అందజేశారు. మండలంలోని గుమ్మిర్యాల్ గ్రామ శివారులోని నదిపై చెక్ డాం లాంటి కట్టడం నిర్మించి నీళ్లు నిలువ చేసి ఆ నీటిని ఎత్తిపోతల ద్వారా గుమ్మిర్యాల్, నాగేంద్ర నగర్ గ్రామాలతో పాటు మండలంలోని అన్ని గ్రామాల చెరువులకు మరియురైతులకుఅనుకూలంగా ఉన్నస్థలలకునీళ్లుఅందించడంతో భూగర్భ జలలు నిల్వ చేయొచ్చని, దీనితో రైతుల బోరుబావులు ఎప్పుడు నిండుగా నీరు పోస్తాయని రైతులు ప్రతి సీజన్లో అన్ని రకాల పంటలు పండించి సంతోషంగా ఉంటారని దయానంద్ విజ్ఞప్తి పత్రం లో తెలిపారు.ఈ ఎత్తి పోతల పథకం గురించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వల దృష్టికి తీసుకెళ్లాలని ఆయన కలెక్టర్ కి అందజేసిన వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.దీనితో పాటు మండలంలోని బట్టాపూర్ గ్రామం లో సుమారు 40 విద్యుత్ స్థంబాలు అవసరం ఉన్నాయని, దీనితో పాటు గ్రామ శివారులోని మల్లన్న స్వామి ఆలయం నుండి శుక్రవారం దేవి అమ్మవారి ఆలయం వద్ద విద్యుత్ సౌకర్యం, నీటి సౌకర్యం కోసం కొత్త మీటర్ కోసం స్థానిక గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు డిడి కట్టారని మల్లన స్వామి ఆలయం వద్ద నుండి శుక్రవారం దేవి అమ్మవారి ఆలయం వరకు విద్యుత్ స్తంభాలు విద్యుత్ లైను మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తో పాటు సంబంధిత అధికారి డి ఈ టెక్నికల్ వెంకటరమణ కు తెలపగా రెండు నెలల లోపు విద్యుత్ స్తంభాలు, విద్యుత్ తీగలు, సౌకర్యం ఏర్పాటు చేస్తామని అధికారి తెలిపారని దయానంద్ అన్నారు.
🏠 Home