🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 5:19 am Posted by : TELANGANA KERATAM

సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వార్షికోత్సవ వేడుకలు

News Image

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 09 : సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ యాక్ట్ – 2005) ద్వారా సామాన్య ప్రజలకు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ శాఖలు, చట్ట పరిధిలోకి వచ్చే ఇతర సంస్థల నుంచి సమాచారాన్ని పొందే హక్కుపై అవగాహన కల్పించాలనే ప్రధాన లక్ష్యంతో పనిచేస్తున్న సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను సోమవారం జగిత్యాల జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ చంటి ముదిరాజు ఆదేశాల మేరకు, జిల్లా స్థాయిలో వొడ్నాల రామారావు సమక్షంలో కేక్ కట్ చేసి, ద్వితీయ వార్షికోత్సవ వేడుకలను జరుపుకున్నారు..ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం యొక్క ప్రాముఖ్యత, దాని ద్వారా సామాన్య ప్రజలకు కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంలో ఈ చట్టం పాత్ర గురించి వివరించారు. ప్రజలు తమకు అవసరమైన ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, నిధుల వినియోగం, ప్రభుత్వ ఉత్తర్వులు, అధికారుల విధులు, అభివృద్ధి పనులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా పొందవచ్చో వివరించారు. అలాగే చట్ట పరిధిలోకి వచ్చే ప్రభుత్వ సహాయం పొందుతున్న సంస్థల నుంచి కూడా నిబంధనలకు అనుగుణంగా సమాచారాన్ని పొందవచ్చని తెలియజేశారు. సమాచార హక్కు చట్టం సామాన్య పౌరుడికి ఒక శక్తివంతమైన ప్రజాస్వామ్య ఆయుధం. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అందాల్సిన సమాచారం అందుబాటులో ఉండేలా చూడటం, అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం, అధికార వ్యవస్థలో పారదర్శకతను పెంపొందించడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని, తమ హక్కులను బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని, గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజల్లో విస్తృతమైన అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు కమిటీ కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిప్ప నిరంజన్, గట్ల ప్రకాష్, చింత సూర్యనారాయణ ప్రసాద్, బాలే అజయ్, రాధారపు మనోజ్, పులి అనిల్, సత్యనారాయణ, చంద్రశేఖర రావు, కిరణ్, వినయ్, సురేష్, నరేందర్, సాయి కృష్ణ, సృజన్, సురేష్, ఆనంద్, సంతోష్, రమేష్, మధుకర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home