🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 5:33 am Posted by : TELANGANA KERATAM

కార్మిక కర్షక ఐక్యతను బలోపేతం చేద్దాం నవంబర్ 15న బహిరంగ సభ

News Image
కార్మిక కర్షక ఐక్యతను బలోపేతం చేద్దాం       నవంబర్ 15న బహిరంగ సభ  కార్మిక వర్గం తుమ్మల వీరారెడ్డి, ఎండి సలీం   తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ( ప్రజాప్రతినిధి): అఖిలభారత రైతు సంఘం జాతీయ 36వ మహాసభల సందర్భంగా నవంబర్ 15న జరుగు బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని కార్మిక కర్షక మైత్రిని కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు.  సోమవారం సిఐటియు నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నవంబర్ 15 బహిరంగ సభను జయప్రదం చేయాలని ముద్రించిన కరపత్రాన్ని సిఐటియు కార్యాలయంలో ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఏఐకేఎస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతు వ్యతిరేక విధానాలను ప్రతీకటిస్తూ సమరశీల పోరాటాలు నిర్వహిస్తుందని అన్నారు ఐక్య ఉద్యమాలలో కీలక భూమిక పోషిస్తున్న సుదీర్ఘ పోరాటాల చరిత్ర కలిగిన అఖిలభారత రైతు సంఘం జాతీయ మహాసభలు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నాయకత్వం వహించిన ఉద్యమాల పురిటి గడ్డ నల్లగొండలో నవంబర్ 15 నుంచి 18 వరకు జరుగుతున్నాయని వారు తెలిపారు ఈ మహాసభల ప్రారంభ రోజు నవంబర్ 15న ఎన్జీ కాలేజీ గ్రౌండ్లో బహిరంగ సభ జరుగుతుందని ఆ బహిరంగ సభకు జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు మహాసభల సందేశాన్ని గ్రామ గ్రామాలకు పారిశ్రామిక ప్రాంతాలకు తీసుకువెళ్లాలని వారు పేర్కొన్నారు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉదారవాద విధానాల వలన దేశంలోని రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారు ఆరోపించారు. పండించిన పంటకు కనీస న్యాయమైన మద్దతు ధర లభించకపోవడం వలన రైతుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మోడీ నాయకత్వంలోని కేం
🏠 Home