🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 5:57 am Posted by : TELANGANA KERATAM

ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంలో మాల సామాజిక వర్గానికి న్యాయం చేయాలి.

News Image
ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ వి వినతిపత్రం సమర్పించిన మాల సంఘం ప్రతినిధులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 9):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఎస్సీ వర్గీకరణ, రోస్టర్ విధానంలో ఎస్సీ గ్రూప్–3లోని మాల సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ, ఈ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు సోమవారం నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండల కేంద్రంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఎస్సీ వర్గీకరణలో గ్రూప్–3 కింద ఉన్న మాల సామాజిక వర్గానికి రోస్టర్ విధానం ద్వారా కలుగుతున్న నష్టాలను అధికారులు, ప్రభుత్వం పునఃపరిశీలించాలని కోరారు. రోస్టర్ విధానంలోని లోపాలను సరిదిద్ది, శాస్త్రీయమైన ప్రాతిపదికన సమీక్షించి అన్ని వర్గాలకు సమాన అవకాశాలు కల్పించాలని వినతిపత్రంలో విజ్ఞప్తి చేశారు.ప్రభుత్వం ఈ సమస్యపై సానుకూలంగా స్పందించి, మాల సామాజిక వర్గానికి న్యాయం జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
🏠 Home