🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 6:42 am Posted by : TELANGANA KERATAM

ఘట్‌కేసర్‌లో ఘనంగా సదర్ సమ్మేళన ఉత్సవాలు

News Image
*దున్నపోతుల విన్యాసాలు, డప్పు చప్పుళ్లు, బ్యాండ్ మేళాలతో యాదవ సోదరుల సందడి
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 9: మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఘట్‌కేసర్ ఆరో డివిజన్ అంబేద్కర్ కూడలి వద్ద యాదవ సంఘం అధ్యక్షుడు మామిండ్ల మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో సదర్ సమ్మేళన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు వేముల మహేష్ గౌడ్, మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్, మాజీ అధ్యక్షులు వేల్పుల రామకృష్ణ యాదవ్, బండమీది యాదగిరి యాదవ్ తదితరులు హాజరయ్యారు. వారు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ప్రారంభించారు.యాదవుల సంస్కృతి, సంప్రదాయాలు, ఐక్యత, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిర్వహించిన ఈ వేడుకలు అంగరంగ వైభవంగా సాగాయి. దున్నపోతుల విన్యాసాలు, ఆర్కెస్ట్రా పాటలు, బ్యాండ్ మేళాలు, డప్పు చప్పుళ్లు, సంప్రదాయ పగిడీలతో యాదవ సోదరులు ఉత్సాహంగా సందడి చేశారు. ఈ వేడుకలు స్థానికులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఘట్‌కేసర్‌తో పాటు పరిసర గ్రామాల నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఉత్సవాల్లో పాల్గొన్నారు.కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ఘట్‌కేసర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ కిరణ్, పోలీసు సిబ్బందికి, ప్రజాప్రతినిధులకు, వివిధ కుల సంఘాల పెద్దలకు, పట్టణ ప్రజలకు యాదవ సంఘం అధ్యక్షుడు మామిండ్ల మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శి రాజబోయిన రామచందర్ యాదవ్, కమిటీ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సదర్ సమ్మేళన ఉత్సవాలు యాదవుల ఐక్యతను, సంప్రదాయాల పరిరక్షణ పట్ల వారికున్న నిబద్ధతను చాటిచెప్పాయని నిర్వాహకులు పేర్కొన్నారు.
🏠 Home