🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 6:55 am Posted by : TELANGANA KERATAM

ప్రజావాణిలో రెండుసార్లు అర్జీ ఇచ్చినా స్పందన కరువు!

News Image
ప్రజావాణిలో రెండుసార్లు అర్జీ ఇచ్చినా స్పందన కరువు!
28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలిఅధికారుల నిర్లక్ష్యంపై ఎంసీపీఐయూ పార్టీ ఆగ్రహం..
 •జిల్లా కలెక్టర్ స్పందించాలి: పసులేటి వెంకటేష్

బెల్లంపల్లి ప్రతినిధి నవంబర్ 09(తెలంగాణ కెరటం):

ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల నిర్లక్ష్యంతో కేవలం కాగితాలకే పరిమితమవుతోందని ఎంసీపీఐయూ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి పసులేటి వెంకటేష్ విమర్శించారు.ఈరోజు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలని కోరుతూ ఎంపీడీవో మహేందర్‌కు ఎంసీపీఐయూ పార్టీ నాయకులు రెండోసారి వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా పసులేటి వెంకటేష్ మాట్లాడుతూ.. గతంలో 24-08-2026న ఇదే సమస్యపై ప్రజావాణిలో దరఖాస్తు సమర్పించామని తెలిపారు. DMNCL24082600139 నంబర్‌తో నమోదైన దరఖాస్తుపై ఇంతవరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అధికారుల చుట్టూ, కార్యాలయాల చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా నిర్లక్ష్యపు సమాధానాలే వస్తున్నాయని, సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రజల చెంతకు పాలన అంటుంటే క్షేత్రస్థాయిలో అధికారులు ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.మంచిర్యాల జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి 28వ వార్డులో మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు సమస్యపై విచారణ జరిపించాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వార్డు ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా పైపులైన్ ఏర్పాటు చేసి న్యాయం చేయాలని కోరారు.లేనిపక్షంలో 28వ వార్డు ప్రజలను కలుపుకొని మున్సిపల్ కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో ఎంసీపీఐయూ బెల్లంపల్లి మండల కార్యదర్శి తొగరి రాహుల్ పాల్గొన్నారు
🏠 Home