🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 6:57 am Posted by : TELANGANA KERATAM

యువతకు వాలీబాల్ కిట్ అందజేత

News Image
యువతకు వాలీబాల్ కిట్ అందజేత
బెల్లంపల్లి ప్రతినిధి నవంబర్ 09(తెలంగాణ కెరటం):
వేమనపల్లి మండలంలోని చామనపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని బద్దెంపల్లి గ్రామ యువతకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి, బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస్ రాంటెంకి వాలీబాల్ కిట్ అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల్లో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. విద్యకు అధిక ప్రాధాన్యతనిస్తూ గ్రామ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ, ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని వాటి సాధన కోసం కృషి చేయాలని సూచించారు.యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు వాలీబాల్ కిట్ అందజేయడం పట్ల గ్రామ యువత హర్షం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు దివాకర్, యువ నాయకులు శంకర్, గణేష్, సంపత్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home