మాదిగ విద్యార్థి సమాఖ్య నూతన మండల కమిటీ ఎన్నిక

విజ్ఞానం, వివేకం, వికాసంలో విద్యార్థులు ముందుండాలి: ఏపూరి వెంకటేశ్వరరావు
తెలంగాణ కెరటం ఉమ్మడి వరంగల్ జిల్లా నవంబర్ 9
ధర్మసాగర్ ఎస్సీ సామాజిక భవనంలో సింగారపు పవన్ మాదిగ అధ్యక్షతన మాదిగ విద్యార్థి సమాఖ్య మండల సదస్సు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ మాట్లాడుతూ విద్యార్థులు విద్యారంగంలో రాణించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని పిలుపునిచ్చారు. ఎమ్మార్పీఎస్ సాధించిన ఎస్సీ వర్గీకరణ ఫలాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. మాదిగల్లో అక్షరాస్యత పెంపునకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. అనంతరం ధర్మసాగర్ మండల నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన కమిటీ వివరాలు: అధ్యక్షుడిగా కొయ్యడ గౌతం మాదిగ, అధికార ప్రతినిధిగా కొలిపాక సర్జన్ మాదిగ, ప్రధాన కార్యదర్శిగా కనకం అక్షిత మాదిగ, ఉపాధ్యక్షులుగా కుర్సపల్లి ఆదిత్య, కందుకూరి సందేశ్ వర్మ, పసునూరి వికాస్ మాదిగ, కార్యదర్శిగా వాస్కుల రోహిత్ మాదిగ ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో బొడ్డు శాంతి సాగర్ మాదిగ, తడుగుల విజయ్ మాదిగ, గంగారపు శ్రీనివాస్ మాదిగ, గొల్లపల్లి అనిల్ మాదిగ, సోంపల్లి అన్వేష్ మాదిగ, వక్కల అక్షిత్ మాదిగ, కనకం అనిల్ మాదిగ, నక్క ప్రవీణ్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.