పాఠశాల స్థాయిలో ఘనంగా 'హక్కులు - బాధ్యతలు రాజ్యాంగ విలువలపై అవగాహన సదస్సు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 10:
నిజామాబాద్ జిల్లామోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో "హక్కులు - బాధ్యతలు మరియు రాజ్యాంగ విలువలు - పౌరుల సమానత్వం" అనే అంశంపై ప్రత్యేక అవగాహన సదస్సును ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ (న్యాయవాది) పుప్పాల నరేష్ మాట్లాడుతూ.మనకు రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఎంతో ముఖ్యమైనవని, ఎట్టి పరిస్థితుల్లోనూ బాధ్యతలను విస్మరించకూడదని స్పష్టం చేశారు. రాజ్యాంగానికి కచ్చితంగా గౌరవం ఇస్తూ, దానికనుగుణంగా రాజ్యాంగానికి లోబడి జీవించాలని పిలుపునిచ్చారు. నేటి బాలబాలికలే రేపటి భావి భారత పౌరులుగా చక్కగా తయారవ్వాలంటే కేవలం రాజ్యాంగాన్ని అనుసరిస్తూ, క్రమశిక్షణతో మెదులుకోవాలని హితవు పన్నారు.మంచి నడవడికతో ఉన్నత చదువులు చదివి, భవిష్యత్తులో గొప్ప వ్యక్తులుగా తయారై తమకూ, తమ తల్లిదండ్రులకు మంచిపేరుసంపాదించుకోవాలని ఆకాంక్షించారు. అంతేకాకుండా, మన గ్రామానికి మంచి పేరు తెచ్చి, దేశంలోనే మన గ్రామం ఆదర్శంగా నిలిచేలా మీ వంతు కీర్తిని తీసుకురావాలని విద్యార్థులనుఉత్సాహపరిచారువిద్యార్థులు రాజ్యాంగ విలువలను అలవర్చుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమం విద్యార్థులలో దేశభక్తిని, సామాజిక స్పృహను పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని తెలియజేస్తూ సదస్సును ముగించారు. ఈ కార్యక్రమంలో హెచ్‌ఎం, ఎంఈఓ సమ్మిరెడ్డి, గ్రామ పంచాయతీ కార్యదర్శి బాస నరేందర్, ఉపసర్పంచ్ సదానంద్, పాలకవర్గ సభ్యులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.