ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించిన ఆశా కార్యకర్తలు.

ఆశా వర్కర్లకు రూ.18,000/- లు ఫిక్స్డ్ వేతనం నిర్ణయించాలి.
పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం, ఉద్యోగ భద్రత ఇతరసమస్యలు పరిష్కరించాలి.
సమస్యలు పరిష్కరించకపోతే డిసెంబర్ 15 నుండి నిరవధిక సమ్మె.
సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ నాగర్ కర్నూల్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే క్యాంపు ముట్టడించారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని చైర్మన్ సునీంద్ కు సమర్పించారు.ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. శ్రీనివాసులు మాట్లాడుతూరాష్ట్రంలో ఆశా వర్కర్లు 28 వేల మంది గత 20 సంవత్సరాల నుండిపనిచేస్తున్నారని . వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రూరల్ 1,000, పట్టణంలో 2,000 నుండి 5,000 మంది ప్రజలకు ఆశాలు సేవలందిస్తున్నారని,. గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను అరికడుతున్నారని . కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆశాలు కీలకపాత్ర పోషించారని,డబ్ల్యూహెచ్ఓ ఆశాలను గ్లోబల్ లీడర్స్ అని ప్రకటించిందని ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్ డ్యూటీలు, ఏఎన్సీ, పిఎన్సి, టార్గెట్స్, ఎన్సిడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్డ బ్బాలను మోయడం, ఎగ్జామ్ డ్యూటీలు, డ్రై డే, ఫ్రైడే లెప్రసీ, పల్స్ పోలియో తదితర అనేక పనులు ఉదయం నుండి రాత్రి వరకు చేస్తున్నారని . ఇంత శ్రమ చేస్తున్న ఆశాలకు నేటికీ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం లేదు. కేవలం రూ.9,900/-లు మాత్రమే పారితోషికాలు చెల్లిస్తున్నారని . ఇతర ఏ సౌకర్యాలు లేవు. గత మూడు సంవత్సరాల నుండి పారితోష్కల్ పెంచలేదని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయని . పని భారం పెరిగి వచ్చే పారితోషికాలు సరిపోక ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.తెలంగాణ రాష్ట్రంలో ఆశాలు సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు నిరవధిక సమ్మె చేశారని . సమ్మె సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్ కోఠి కమీషనర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా గత ప్రభుత్వం ఆనాటిఉన్నతాధికారులు నాయకులతో చర్చలు జరిపారని . ఆశాల సమస్యల పరిష్కారం కోసం ఆశాల సమస్యలపరిష్కారంకోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారని అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని . కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చారని,ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆశాలు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మేము అధికారంలోకి వస్తే ఆశాలు అడుగుతున్న డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు కావస్తున్న ఇప్పటివరకు ఇచ్చిన ఏ ఒక్క సమస్య పరిష్కారం చేయలేదని ఆయన మండిపడ్డారు.ఇప్పటికైనా తెలంగాణ ప్రజా ప్రభుత్వం ఆశ వర్కర్లకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని లేదంటే ప్రజా పతనం తప్పదని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యూనియన్ గౌరవ అధ్యక్షులు పర్వతాలు, సిఐటియు జిల్లా కోశాధికారి పొదిల రామయ్య, ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందికొండ గీత, యూనియన్ జిల్లా అధ్యక్షురాలు జయమ్మ, ఉపాధ్యక్షురాలు సువర్ణ, పార్వతి, షమీం, విజయనిల మానస, బాలమణి, నర్మదా, కృష్ణవేణి,నిర్మల, భాగ్యలక్ష్మి, వెంకటమ్మ, లక్ష్మి, మాణిక్యమ్మ, భాగ్యలక్ష్మి, సులోచన, తదితరులు పాల్గొన్నారు.