🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 10 November 2026, 5:11 pm Posted by : TELANGANA KERATAM

రహీం ఆశయాలను కొనసాగిస్తాం. ఎల్ దేశ నాయక్.

News Image
రహీం ఆశయాలను కొనసాగిస్తాం.
ఎల్ దేశ నాయక్.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూలు జిల్లా ప్రతినిధి (నవంబర్ 10):
కామ్రేడ్ రహీం ఆశయాలను కొనసాగిస్తామని సిపిఎం పార్టీ జిల్లా నాయకులు ఎల్ దేశ నాయక్ అన్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొమ్మనపల్లి గ్రామంలో రహీం 35వ వర్ధంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ దేశ నాయక్ రహీం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత రహీంను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మల్లేష్ మండల కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home