మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్....
మున్సిపల్ కార్మికుల సంక్షేమానికి అండగా నిలిచిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావ్....తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....మంచిర్యాల....మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ విభాగానికి చెందిన 131 మంది మున్సిపల్ కార్మికులకు ఐదు సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పీఎఫ్ (పిఫ్ ) బకాయిలు, ఈఎస్ఐ (ఇసి ఐ ) సౌకర్యాల కల్పన కోసం మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ క్రమంలో గత మే 1వ తేదీన మేడే సందర్భంగా కార్మికులకు సంబంధించిన రూ.3 కోట్ల పీఎఫ్ బకాయిల చెక్కును ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు చేతుల మీదుగా అందజేయడం జరిగింది. ఎమ్మెల్యే కృషి ఫలితంగా అక్టోబర్ 20వ తేదీన 131 మంది మున్సిపల్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో ఐదు సంవత్సరాలకు సంబంధించిన పీఎఫ్ బకాయిలు జమ కాగా, ప్రతి ఒక్క కార్మికుడికి లక్ష రూపాయలకు పైగా పీఎఫ్ సొమ్ము అందింది.తమ ఐదు సంవత్సరాల నిరీక్షణకు తెరదించి, తమ కుటుంబాల భవిష్యత్తుకు భరోసా కల్పించిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కి కృతజ్ఞతలు తెలిపేందుకు ఈరోజు మున్సిపల్ కార్మికులు లక్ష్మీ థియేటర్ చౌరస్తా నుంచి భారీ ర్యాలీగా తరలివచ్చి ఎమ్మెల్యే మరియు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ని మర్యాదపూర్వకంగా కలిసి గజ్జమాలతో ఘనంగా సన్మానించి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.
కార్మికుల చెమట చుక్క విలువ తెలిసిన నాయకుడు.. వారి కష్టాన్ని తన బాధ్యతగా భావించే నాయకుడు.. వారి కుటుంబాల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే నాయకుడు మన ప్రేమ్ సాగర్ రావు అని కార్మికులు కొనియాడారు.అధికారం అనేది పదవి కోసం కాదు.. ప్రజలకు, ముఖ్యంగా కష్టపడి పనిచేసే కార్మికులకు అండగా నిలబడటానికేనని మరోసారి నిరూపించారని కార్మికుల కష్టంలో తోడుగా, వారి కన్నీటిలో భాగస్వామిగా, వారి సంక్షేమంలో ముందడుగుగా నిలిచే నాయకుడు ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అని కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు .ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్, మున్సిపల్ కార్మికుల గౌరవ అధ్యక్షులు, కార్పొరేటర్ సుధమల్ల హరికృష్ణ కార్పొరేటర్లు, మున్సిపల్ కార్మికుల అధ్యక్షులు కొయ్యల వెంకటి, మున్సిపల్ కార్మికులు ,తదితరులు పాల్గొన్నారు..