పదేళ్లుగా పెండింగ్లో ఉన్న 76 జీవోకు పునరుద్ధరణ.....
పదేళ్లుగా పెండింగ్లో ఉన్న 76 జీవోకు పునరుద్ధరణ.....సింగరేణి స్థలాల్లో నివాసం ఉంటున్న వారికి ఇంటి పట్టాల పంపిణీ......
బెల్లంపల్లి అభివృద్ధికి ఎంపీ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయింపు – ఎంపీ గడ్డం వంశీకృష్ణ......
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు...మంచిర్యాల..బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూ పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకర్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు.బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయం సమీపంలో రూ.45 లక్షల వ్యయంతో చేపట్టనున్న డివైడర్ నిర్మాణ పనులకు ఎంపీ, ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. అనంతరం పట్టణంలోని 33వ వార్డులో సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న లబ్ధిదారులకు జీవో 76 ద్వారా మంజూరైన ఇంటి పట్టాలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎంపీ గడ్డం వంశీకృష్ణ మాట్లాడుతూ.. గత పదేళ్లుగా పెండింగ్లో ఉన్న జీవో 76ను కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రత్యేక చొరవతో పునరుద్ధరించడం జరిగిందని తెలిపారు. సింగరేణి స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న పేదలకు తిరిగి ఇంటి పట్టాలు అందించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.ఎమ్మెల్యే గడ్డం వినోద్ శంకర్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి పట్టణంలో అభివృద్ధి పనులు నిరంతరం కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని రూ.45 లక్షలతో డివైడర్ నిర్మాణ పనులను ప్రారంభించామని తెలిపారు.బెల్లంపల్లి పట్టణ అభివృద్ధి కోసం తన ఎంపీ లాడ్స్ నిధుల నుంచి రూ.25 లక్షలు కేటాయించినట్లు ఎంపీ వెల్లడించారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా ప్రజాప్రతినిధుల సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దావా స్వాతి, మార్కెట్ కమిటీ చైర్పర్సన్ రత్నం సుకుమారి, కౌన్సిలర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.