నేతకాని సమాజం ఎవరి రాజకీయాలకు బందీ కాదు!

సమాజం పేరుతో ఏకపక్ష ప్రకటనలు చేయడం మానుకోవాలి – నేతకాని మహార్ సంక్షేమ సంఘం స్పష్టీకరణ
తెలంగాణ కెరటం మంచిర్యాల జిల్లా ప్రతినిధి రాం వేణు....
మంచిర్యాల..నేతకాని మహార్ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు దుర్గం రాజేష్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా సీసీసీ నస్పూర్‌లో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు సునార్కర్ రాంబాబు నేతకాని ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా సునార్కర్ రాంబాబు నేతకాని మాట్లాడుతు ఇటీవల పెద్దపల్లి ప్రెస్ క్లబ్‌లో కొంతమంది నేతకాని కులస్తులు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణకు నేతకాని సమాజం మొత్తం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తోందంటూ చేసిన ప్రకటనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు నేతకాని సమాజం మొత్తం అండగా ఉందని ప్రకటించే హక్కు ఎవరికీ లేదని స్పష్టం చేశారు. సమాజంలోని ప్రతి ఒక్కరి అభిప్రాయాన్ని తెలుసుకోకుండా మొత్తం సమాజం తరఫున ఏకపక్ష ప్రకటనలు చేయడం సరికాదన్నారు.నేతకాని సమాజం ఎవరి రాజకీయాలకు బందీ కాదు. ప్రతి ఒక్కరికీ తమ రాజకీయ అభిప్రాయాలను వ్యక్తపరిచే స్వేచ్ఛ ఉందని, అయితే సమాజం పేరును ఉపయోగించుకుని వ్యక్తిగత లేదా రాజకీయ ప్రయోజనాలు పొందే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు.నేతకాని నాయకులపై దూషణలు, బెదిరింపులు తగవు.రాష్ట్ర యువజన అధ్యక్షుడు అనపర్తి యువరాజు మాట్లాడుతూ మంథని నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి, నేతకాని సీనియర్ నాయకులు సెగ్గం రాజేష్‌పై పైడిమల్ల నర్సింగ్ దూషణలకు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నేతకాని భవన నిర్మాణానికి అందరి సహకారం గుర్తించాలి.మంచిర్యాలలో నేతకాని భవనానికి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కలిసి కోటి రూపాయలు అందించారంటూ జరుగుతున్న ప్రచారంపై కూడా సంఘం నాయకులు స్పందించారు.గతంలో బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, పెద్దపల్లి మాజీ ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేత, అలాగే నేతకాని కులస్తులు అందించిన విరాళాలు, సహకారం కూడా నేతకాని సంఘ భవన నిర్మాణానికి ఎంతో దోహదపడ్డాయని గుర్తు చేశారు. అందరి సహకారాన్ని గుర్తించకుండా కొంతమందికి మాత్రమే ఘనత ఆపాదిస్తూ ప్రచారం చేయడం సరికాదన్నారు.సమాజ ఐక్యతే మా లక్ష్యం – రాజకీయాలకు అతీతంగా నేతకాని సమాజ గౌరవం, ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం మా పోరాటం కొనసాగుతుంది అని నాయకులు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన అధ్యక్షులు అనపర్తి యువరాజు, జిల్లా అధికార ప్రతినిధి కొండగుర్ల శ్రీనివాస్, నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ జిమ్మిడి గోపాల్, చాపిడి విఘ్నేష్, గోమాస రాజం తదితరులు పాల్గొన్నారు.