తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు భరోసా కల్పించాలి.. టీజేఏసీ నేత శ్రీనివాస్.
అధికార, ప్రతిపక్షాలు ఉద్యమకారుల హక్కుల పట్ల స్పందించడం స్వాగతనీయం.
తెలంగాణ ఉద్యమకారుల కుటుంబాలకు భరోసా కల్పించాలి..
టీజేఏసీ నేత శ్రీనివాస్.
తెలంగాణ కెరటం నాగర్‌కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11):
జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామానికి చెందిన,తెలంగాణ ఉద్యమకారుడు, పీఏసీఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని ఆదుకునేందుకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు ముందుకు రావడం స్వాగతించదగిన పరిణామమని టీజేఏసీ నేత శ్రీనివాస్ అన్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్యేలు వీరేశం, సామ్యూల్, జనగామ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ప్రతాపరెడ్డి తదితరులు బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం అందించడం అభినందనీయమన్నారు. ఈ సహాయం కుటుంబానికి కొంతమేర ఆర్థిక భరోసా కల్పిస్తుందని పేర్కొన్నారు.అదేవిధంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి హరీశ్‌రావు, పల్లా రాజేశ్వర్‌రెడ్డి తదితరులు లక్ష్మణ్ గౌడ్ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 లక్షల ఆర్థిక సహాయం అందించడంతో పాటు, భవిష్యత్తులోనూ కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇవ్వడం హర్షణీయమన్నారు.ఉద్యమకారులకు భరోసా కల్పించాలి.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం దశాబ్దాల పాటు అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమకారులను, తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలను అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు స్వయంగా కలిసి పరామర్శించాలని, వారికి అండగా ఉన్నామనే భరోసా కల్పించాలని శ్రీనివాస్ సూచించారు.రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అధికార కాంగ్రెస్ ప్రభుత్వం ఇకనైనా కాలయాపన చేయకుండా తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యమకారుల కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపించి, వారికి తగిన గుర్తింపు, గౌరవం, ఆర్థిక భరోసా కల్పించాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారుల త్యాగాలను గుర్తించి, వారి కుటుంబాల సంక్షేమానికి ప్రభుత్వం శాశ్వత కార్యాచరణ రూపొందించాలని టీజేఏసీ నేత శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు.