🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 3:52 pm Posted by : TELANGANA KERATAM

గ్రామీణ అభివృద్ధికి మరో ముందడుగు.

News Image
గ్రామీణ అభివృద్ధికి మరో ముందడుగు.
ప్రజలకు మరింత చేరువలో బ్యాంకింగ్ సేవలు.
తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (నవంబర్ 11):
నాగర్ కర్నూల్ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని నాగర్ కర్నూల్ జిల్లా తాడూరు మండలం మెడిపూర్ గ్రామంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతన శాఖ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగర్ కర్నూలు పార్లమెంట్ సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఎంపీలపురం రాష్ట్ర కన్వీనర్ ప్రదేష్ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ మల్లు రవి పాల్గొని బ్యాంకు శాఖను స్థానిక ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపి డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఈ నూతన బ్యాంకు శాఖ ద్వారా మెడిపూర్ గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు మరింత చేరువ కానున్నాయి. రైతులు, మహిళలు, వ్యాపారులు, విద్యార్థులు మరియు గ్రామీణ ప్రజలకు ఆర్థిక సేవలు సులభంగా అందుబాటులోకి రానున్నాయని.గ్రామీణ ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికి, ప్రజల ఆర్థిక స్వావలంబనకు ఇలాంటి బ్యాంకింగ్ సదుపాయాలు ఎంతో దోహదపడతాయని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.గ్రామీణ ప్రగతే లక్ష్యం. ప్రజా సంక్షేమమే ధ్యేయం.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మల్లయ్య, మరియు గ్రామ పెద్దలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, బ్యాంక్ సిబ్బంది పాల్గొన్నారు.
🏠 Home