పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌడ్!
పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలోకి యర్కల శ్రీనివాస్ గౌడ్! నల్లగొండ–ఖమ్మం–వరంగల్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధం
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే ప్రధాన అజెండా..పట్టభద్రుల సమస్యల పరిష్కారమే లక్ష్యం
తెలంగాణ కెరటం (నల్గొండ జిల్లా ప్రతినిధి): ఒకవైపు ప్రభుత్వ ఉన్నత ఉద్యోగం..మరోవైపు వేలాది మంది నిరుద్యోగుల ఆశలు, ఆకాంక్షలకు గొంతుకగా నిలవాలన్న సంకల్పం! ఉన్నత హోదాలో ప్రభుత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పటికీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్షంగా ప్రజా జీవితంలోకి రావాలని యర్కల శ్రీనివాస్ గౌడ్ నిర్ణయించుకున్నారు. అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా పనిచేస్తున్న ఆయన స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) కోరుతూ ప్రభుత్వానికి దరఖాస్తు సమర్పించారు.నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, పట్టభద్రుల సమస్యల పరిష్కారం, ఉద్యోగ భద్రత, విద్యావ్యవస్థలో మార్పులే తన ప్రధాన అజెండాగా ఆయన ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.ప్రభుత్వ ఉన్నత ఉద్యోగంలో కొనసాగుతున్న యార్కల శ్రీనివాస్ గౌడ్ తన భవిష్యత్తు ప్రస్థానానికి కొత్త దిశను ఎంచుకున్నారు. తెలంగాణ అటవీ శాఖలో అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్‌గా పనిచేస్తున్న ఆయన.. ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్ఛందంగా విరమణ పొందాలని నిర్ణయించుకున్నారు. ప్రజా సమస్యలను మరింత దగ్గరగా తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేయాలనే ఉద్దేశంతో రాజకీయ రంగంలోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో నల్లగొండ–ఖమ్మం–వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని తన రాజకీయ ప్రస్థానానికి వేదికగా ఎంచుకున్నారు.యార్కల శ్రీనివాస్ ప్రస్తుతం తెలంగాణ అటవీ శా�