🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 4:33 pm Posted by : TELANGANA KERATAM

పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ధరావత్ ఆకాష్ నాయక్ నియామకం

News Image
పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా ధరావత్ ఆకాష్ నాయక్ నియామకం
నూతన బాధ్యతలు చేపట్టిన ఆకాష్ నాయక్‌కు నాయకుల ఘన సన్మానం.. అభినందనల వెల్లువ
(తెలంగాణ కెరటం) ఘట్‌కేసర్ ప్రతినిధి /నవంబర్ 11: పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా నూతన అధ్యక్షుడిగా ధరావత్ ఆకాష్ నాయక్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతన బాధ్యతలు చేపట్టిన ఆకాష్ నాయక్‌ను ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు బిక్కునాథ్ నాయక్, సీనియర్ నాయకులు దారావత్ తావూర్య నాయక్ శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గిరిజనుల హక్కుల పరిరక్షణ, విద్య, వైద్యం, ఉపాధి అవకాశాల కల్పనతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలని తెలిపారు. అలాగే పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ, యువతను రాజకీయ, సామాజిక కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని పరిష్కారం కోసం నిరంతరం కృషి చేయాలని సూచించారు. తనపై నమ్మకంతో పోచారం డివిజన్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన పార్టీ నాయకత్వానికి ఆకాష్ నాయక్ కృతజ్ఞతలు తెలియజేశారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా బిక్కునాథ్ నాయక్, దారావత్ తావూర్య నాయక్‌లు ఆకాష్ నాయక్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
🏠 Home