సోనియా గాంధీ ఆత్మకథ ఆధారంగా సినిమా తీస్తాను- జగ్గారెడ్డి

తెలంగాణ, కెరటం స్టేట్ ఇంచార్జ్ షేక్ మహబూబ్ 11, నవంబర్ సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుసోనియా గాంధీ తాను స్వయంగా రాసిన ‘బిలాంగింగ్- ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం పై జగ్గారెడ్డి కీలక ప్రకటనసినిమా నిర్మాణం పై 50 మందితో కమిటీ ఏర్పాటు చేస్తాను.సీఎం రేవంత్‌రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభింపజేస్తా.సముద్రమంత లోతున్న కాంగ్రెస్ పార్టీ రాజకీయాన్ని సోనియాగాంధీ అధ్యయనం చేశారు.రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లను దేశం కోసం ముందుకు నడిపిస్తున్న ఘనత ఆమెదేకాంగ్రెస్ నాయకురాలు సోనియాగాంధీ స్వయంగా రాసిన ‘బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా ఆమె జీవితాన్ని తెలుగులో తెరకెక్కిస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ చిత్రానికి సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే నిర్మాతలుగా వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాణానికి రూ.2 కోట్లు ఇస్తానని నియోజకవర్గ కాంగ్రెస్ కన్వీనర్ జులకంటి ఆంజనేయులు ప్రకటించారు.
*50 మందితో కమిటీ*
సినిమా నిర్మాణ ప్రక్రియను ప్రారంభించేందుకు 50 మందితో కమిటీ ఏర్పాటు చేయాలని జగ్గారెడ్డి సూచించారు. ఈ కమిటీని గాంధీ భవన్ పీఆర్వో హరిప్రసాద్ పర్యవేక్షిస్తారని జగ్గారెడ్డి తెలిపారు.నాయకులు నిధులు సిద్ధం చేసుకోవాలని కోరారు. ‘‘ఎన్నికలకు ఖర్చు పెడతారు కదా. దీన్నీ అలాంటి ఖర్చుగానే అనుకోండి. బడ్జెట్ సమీకరించి, మంచి దర్శకుడిని ఎంపిక చేద్దాం’’ అని కార్యకర్తలతో అన్నారు. ఏర్పాట్లు పూర్తయ్యాక ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్‌ను ఆహ్వానించి, వారి చేతుల మీదుగా షూటింగ్ ప్రారంభిస్తామని తెలిపారు. సోనియాగాంధీ జీవితాన్ని కార్యకర్తలు మరింత దగ్గరగా తెలుసుకునేందుకు ఆమె పుస్తక ప్రతులను తెప్పించి పంపిణీ చేస్తామన్నారు.కుటుంబ జీవితం నుంచి రాజకీయ ప్రస్థానం వరకుఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్‌గాంధీ భార్యగా, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీలకు తల్లిగా సోనియాగాంధీ జీవితంలోని వివిధ దశలను సినిమాలో చూపిస్తామని జగ్గారెడ్డి చెప్పారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల హత్యలతో కుటుంబం ఎదుర్కొన్న విషాదం, ఆ తర్వాత సోనియా ఎదుర్కొన్న కష్టాలు, రాహుల్, ప్రియాంకలను పెంచిన తీరు, ఆమె రాజకీయ ప్రస్థానాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామన్నారు. ఎన్నో మతాలు, కులాలు, భాషలతో కూడిన భారతదేశంలో సోనియాగాంధీ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారని చెప్పారు. ‘‘సముద్రం ఎంత లోతో, కాంగ్రెస్ రాజకీయ వ్యవస్థ అంత లోతైనది. ఆ రాజకీయాలను సోనియాగాంధీ అధ్యయనం చేశారు’’ అని వ్యాఖ్యానించారు. ఆమెది విజయవంతమైన రాజకీయ జీవితమని అన్నారు.ప్రధాని పదవిని వదులుకోవడం చరిత్రసోనియాగాంధీకి ప్రధాని పదవిపై వ్యామోహం లేదని జగ్గారెడ్డి అన్నారు. రాజీవ్‌గాంధీ మరణానంతరం పీవీ నరసింహారావు ప్రధాని అయిన సందర్భాన్ని ప్రస్తావిస్తూ, అప్పట్లో సోనియా ఆ పదవిని ఆశించలేదని చెప్పారు. యూపీఏ అధికారంలోకి వచ్చాక సోనియాగాంధీని ప్రధానిగా ఉండాలని పార్టీ నేతలు కోరినా, ఆమె ఆ పదవిని స్వీకరించకుండా మన్మోహన్‌సింగ్‌కు అవకాశం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రధాని అయ్యే అవకాశాన్ని ఆమె వదులుకోవడం చరిత్రలో నిలిచిపోయే నిర్ణయమని అభిప్రాయపడ్డారు.సోనియాగాంధీ, మన్మోహన్సింగ్, రాహుల్‌గాంధీల ఆలోచనల నుంచి ఉపాధి హామీ పథకం రూపుదిద్దుకుందని జగ్గారెడ్డి అన్నారు. గాంధీ కుటుంబం నుంచి మళ్లీ ప్రధాని రావాలని ప్రజలు కోరుకుంటున్నారని, రాహుల్‌గాంధీ ప్రధాని కావాలనేది సోనియాగాంధీ ఆకాంక్ష అని వ్యాఖ్యానించారు.