కోరుట్ల గడి బురుజుల స్థలాన్ని కాపాడే వరకు పోరాటం ఆగదు

ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్
అఖిలపక్ష, ప్రజా సంఘాలతో కలిసి పరిరక్షణకు పిలుపు
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, నవంబర్ 11 : కోరుట్ల పట్టణ చారిత్రక గుర్తింపుగా నిలిచిన గడి బురుజుల స్థలాల కాపాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని కోరుట్ల ఎమ్మెల్యే డా.కల్వకుంట్ల సంజయ్ పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో పట్టణంలోని గడి బురుజుల స్థలాల పరిరక్షణ, పట్టణ చారిత్రక వారసత్వ సంపదను కాపాడాలనే లక్ష్యంతో నిర్వహించిన కార్యక్రమంలో అఖిలపక్ష ప్రజా సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. గడి బురుజుల స్థలాన్ని కొంతమంది వ్యక్తులు ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారనే అంశంపై ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ, ప్రజల ఆస్తులను కాపాడటం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. గడి బురుజు స్థలానికి సంబంధించిన వీఎల్టీ రద్దు అయ్యే వరకు తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తమ పార్టీకి చెందిన నాయకులు, లేదా కార్యకర్తల ప్రమేయం ఉన్నా ఉపేక్షించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. సొంత పార్టీకి చెందిన వారైనా సరే, ప్రజా ఆస్తుల పరిరక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, అవసరమైతే వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. ప్రజలకు చెందాల్సిన ఆస్తుల విషయంలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా చూడాలని, గడి బురుజు స్థలాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. గడి బురుజు స్థల పరిరక్షణ కోసం చేపట్టిన పోరాటం ఇది కేవలం ఆరంభం మాత్రమేనని, ప్రజల ఆస్తులను కాపాడే విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ స్పష్టం చేశారు. అన్ని పార్టీల కౌన్సిలర్లు, అఖిలపక్ష ప్రజా సంఘాలు కలిసి వీఎల్‌టీని రద్దు చేయాలని కోరుతున్నప్పటికీ, సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. గడి బురుజల స్థలంకు అక్రమంగా విధించిన విఎల్‌టి ని వెంటనే రద్దు చేయాలని మరోసారి మున్సిపల్ కమిషనర్‌కు విజ్ఞప్తి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రజల విజ్ఞప్తులను పట్టించుకోకుండా సమస్యను పరిష్కరించకపోతే పరిస్థితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు. అఖిల పక్ష, ప్రజాసంఘాల నాయకులు మాట్లాడుతూ..గడి బురుజుల స్థలం కేవలం భూమి మాత్రమే కాదని, కోరుట్ల పట్టణ చరిత్ర, సంస్కృతి, వారసత్వంతో ముడిపడిన ప్రజా ఆస్తి అని తెలిపారు. దశాబ్దాలుగా ప్రజలకు అందుబాటులో ఉన్న ఈ స్థలాన్ని కాపాడేందుకు గతంలోనూ అనేక ప్రజా ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించామని పేర్కొన్నారు. గడి బురుజుల స్థలాల పరిరక్షణ అనేది ఏ ఒక్క పార్టీకి, వ్యక్తికి సంబంధించిన అంశం కాదని, ఇది కోరుట్ల ప్రజల ఆత్మగౌరవానికి, చారిత్రక వారసత్వానికి సంబంధించిన విషయమని స్పష్టం చేశారు. రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, పట్టణ ప్రజలు ఐక్యంగా ముందుకు వచ్చి గడి బురుజును కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌తో పాటు పట్టణ ప్రముఖులు, కుల సంఘాలు, పలువురు బిఆర్ఎస్ కౌన్సిలర్లు, సర్పంచులు, తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ పేట భాస్కర్, పట్టణ అఖిలపక్ష ప్రజా సంఘాల కోరుట్ల అధ్యక్షులు. ఎం.డి ముజాహిద్. గౌరవ అధ్యక్షులు చెన్న విశ్వనాథం. ప్రధాన కార్యదర్శి తుమ్మలపల్లి శ్రీనివాస్ బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింత భూమేశ్వర్, సిపిఐ నేత సుతారి రాములు. ఎన్ఎచ్ఎఫ్ అధ్యక్షుడు షాహేద్ మహ్మద్ షేక్. వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.