🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 8:03 pm Posted by : TELANGANA KERATAM

అభివృద్ధి పథంలో ఉమ్మడి మద్దూరు మండలం

News Image
అభివృద్ధి  పథంలో ఉమ్మడి మద్దూరు మండలం
రూ.1.30 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి
రూ.50 లక్షలతో శ్రీరామ ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన.. రూ.80 లక్షలతో నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలు ప్రారంభం
తెలంగాణ కెరటం కొడంగల్ నియోజకవర్గ ప్రజా ప్రతినిథి నవంబర్ 11
ఉమ్మడి మద్దూరు మండలంలో అభివృద్ధి పనులకు వేగం పుంజుకుంది. మొత్తం రూ.1.30 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డి, కొడంగల్ ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి శ్రీకారం చుట్టారు. మద్దూరు మున్సిపాలిటీలోని 3వ వార్డులో రూ.50 లక్షలతో నిర్మించనున్న శ్రీరామ ఆలయానికి శంకుస్థాపన చేయగా, ఉమ్మడి మద్దూరు మండల పరిధిలో రూ.80 లక్షల వ్యయంతో నిర్మించిన నాలుగు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రారంభించారు. మద్దూరు మున్సిపాలిటీలోని 3వ వార్డు కౌన్సిలర్ జీడి మౌనిక ప్రకాష్ ఆధ్వర్యంలో శ్రీరామ ఆలయ నిర్మాణానికి భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం సంతోషకరమన్నారు. ఆలయ నిర్మాణం, అంగన్‌వాడీ కేంద్రాల ప్రారంభంతో స్థానిక ప్రజలకు మరింత సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ సరస్వతి జనార్ధన్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాలయ్య, పీఏసీఎస్ చైర్మన్ నర్సింహులు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జీడి వెంకట్రాములు, మాజీ జడ్పీటీసీ రఘుపతిరెడ్డి, పట్టణ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కె. నర్సింహులు గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూనె సంజీవ్, వెంకట్రాములు గౌడ్, ముద్ది భీములు, తిరుపతిరెడ్డి, రమేష్‌రెడ్డి, పిల్లగంట్ల వెంకటప్ప, జంగం బాబు, ముద్ది సుభాష్, నిర్జింత చందు, గణప రవి, రామకృష్ణ, రియాజ్, శామప్ప, కౌన్సిలర్లు గోవిందు, సంజీవ్, మైముద్, సంగీత, కృష్ణవేణి, కో-ఆప్షన్ సభ్యులు యాసిన్, యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు....
🏠 Home