సాగు భూమి సంరక్షణ. మరియు ఆయిలపామ్ సాగుపై అవగాహన కార్యక్రమం
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11,తెలంగాణ కెరటం:దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లపూర్ రైతువేదిక లో బుధవారం రోజున రైతులకి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. వ్యవసాయ అధికారి ప్రవీణ్ ప్రస్తుత ఎల్ నినో పరిస్థితుల్లో ఉన్న నీరుని జాగ్రత్తగా వాడుకుంటూ పాటించవలసిన జాగ్రత్తలు, పంట మార్పిడి ఉపయోగం వివరించారు. యాసంగి లో భూగర్భ జలాలు తగ్గడం, విద్యుత్ సమస్యలు, చెరువులు కాలువలలో నీరు లేకపోవటం సమస్య ల వలన వరి పంట సాగు ఇబ్బంది అవుతుంది కావున వరి పంటకు బదులుగా అరుతడి పంటలయి న మక్కజొన్న, పొద్దు తిరుగుడు, పెసర్లు, బొబ్బర్లు మొ పంటలు వేసుకోవాలని సూచించారు. వరి పొలాలలో జీరో టిల్లేజ్ విధానం లో దున్నకుండా మక్క సాగు గురించి వివరించారు.ఉద్యాన అధికారి డి . రమేష్ మాట్లాడుతూ.. ఉద్యాన పంటల లాభాలు వాటి నుండి వచ్చే దిగుబడిని వివరించారు. ఒక ఎకరం వరి సాగుకు అవసరం అయ్యే నీరుతో 3 ఎకరాల వరకు కూరగాయలు సాగు చేయవచ్చు. పంట మార్పిడి చేసుకొని రైతులు పండ్ల తోటలు, కూరగాయల తోటలు పండించాలి అని కోరారు. ఎండ ప్రభావం, దీనికి ఉద్యాన శాఖ వారిచే అందించే సబ్సిడీ వివరించారు. ఆయిల్ పామ్ తోటలో నాలుగవ సంవత్సరం తరువాత ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని పైన కూడ రైతులకి ఉన్న సందేహాలకి సూచనలు ఇవ్వడం జరిగింది . ఆయిల్ పామ్ పంట 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉద్యాన శాఖ వారిచే మొక్కలు, డ్రిప్ సబ్సిడీ లో అందించబడుతుంది. మొదటి 4 సంవత్సరాలు అంతర పంటలతో లాభం పొందవచ్చు. అంతర పంటలకు, ఫెర్టిలైజర్స్ కి ఎకరానికి 4200, 4 సంవత్సరాల పాటూ అందజేయటం జరుగుతుంది అన్నారు.ప్రస్తుతం టన్ను ఆయిల్ పామ్ ధర 22000 రూపాయలు ఉంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ప్రవీణ్ ఉద్యాన శాఖ అధికారి డి.రమేష్ , వ్యవసాయ విస్థీర్ణ అధికారులు అనూష, ఆయిల్ఫేడ్ ఫీల్డ్ ఆఫీసర్ అరవింద్,amc డైరెక్టర్ కిషన్ రెడ్డి, మల్లారెడ్డి, జీవన్ రెడ్డి, నర్సింలు, రైతులు పాల్గొన్నారు.