🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 9:03 pm Posted by : Kancharala Shivakumar

అగ్నిప్రమాద బాధిత కుటుంబాలను పరామర్శించిన - చెరుకు శ్రీనివాస్ రెడ్డి

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:తొగుట మండలం తుక్కాపూర్ గ్రామంలో నిన్న ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుడు నర్సింలు, చిక్కుడు రాజావ్వ ఇల్లు దగ్ధమై బాధిత కుటుంబాలకు తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లింది. విషయం తెలుసుకున్న దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.ఈ సందర్భంగా అగ్నిప్రమాదం జరిగిన తీరును, జరిగిన నష్టాన్ని బాధిత కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. కష్టకాలంలో బాధిత కుటుంబాలు అధైర్యపడవద్దని భరోసా కల్పిస్తూ, వారికి ఆర్థిక సహాయం అందించి కుటుంబ సభ్యులను ఓదార్చారు.అంతేకాకుండా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున అందించే సహాయ సహకారాలు అందేలా కృషి చేస్తామని, వారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం అండగా ఉంటుందని, బాధిత కుటుంబాలు తిరిగి కోలుకునేలా అవసరమైన సహాయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ చెరుకు విజయ్ (అమర్ )రెడ్డి, గ్రామ సర్పంచ్ మాస్తి కళావతి స్వామి,మండల పార్టీ అధ్యక్షులు పంది రాజు, ఉపాధ్యక్షులు చిక్కుడు ఉప్పలయ్య గ్రామ పార్టీ అధ్యక్షులు బరెంకల స్వామి, నాయకులు వెంకటేశం,బండారు రమేష్ గౌడ్, రాములు, అర్జున్ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home