రైతులకు అండగా ప్రజా ప్రభుత్వం – గ్రామాల అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తాం. -దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి
దుబ్బాక ప్రతినిధి,(అక్బర్ పేట భూంపల్లి) నవంబర్ 11, తెలంగాణ కెరటం:అక్బర్ పేట భూంపల్లి మండలం తాల్లపల్లి గ్రామంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..రైతుల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, రైతులు పండించిన ప్రతి గింజకు మద్దతు ధర కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా కొనుగోలు కేంద్రాల్లోనే తమ ధాన్యాన్ని విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధరను పొందాలని సూచించారు.గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని, ప్రజలకు మెరుగైన పారిశుద్ధ్య సౌకర్యాలు, సురక్షితమైన తాగునీరు, నాణ్యమైన రహదారులు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమం, గ్రామాల అభివృద్ధి, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు నిరంతరం కృషి చేస్తోందని పేర్కొన్నారు.రైతుల సంక్షేమం – గ్రామాల అభివృద్ధి – ప్రజల సంక్షేమమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని చెరుకు శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో దుబ్బాక బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పాతూరి వెంకటస్వామి గౌడ్,మండలం అధ్యక్షులు గుండా శంకర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలూరు కమలాకర్, జిల్లా కార్యదర్శి ఎల్లన్న గారి సురేందర్ రెడ్డి, తిప్పన బోయిన పున్నవ్వ, మండల ప్రధాన కార్యదర్శి పాతూరి ప్రదీప్ రెడ్డి,తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ నీల ప్రభాకర్, బేగంపేట సర్పంచ్ అన్నబోయిన చంద్రశేఖర్, నగరం ఉపసర్పంచ్ జీడిపల్లి రమేష్, తాళ్లపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బొమ్మరపు ఎల్లం, పోతారెడ్డి పేట గ్రామ శాఖ అధ్యక్షుడు మంద చంద్రసాగర్, మాజీ ఎంపీటీసీ పాతూరి శ్రీనివాస్ గౌడ్, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త సోలిపేట ప్రసాద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొమ్మల శ్రీధర్, బాల్తే వెంకటేశం , వెలుపుల యాదగిరి ముదిరాజ్, బండి బాబు లాల్, మధుగని వెంకటి యాదవ్, వార్డు మెంబర్ గడ్డం యాదగిరి, గోపారీ నర్సింలు, గోపరి రమేష్, తిప్పన బోయిన స్వామి, గ్రామ మహిళా అధ్యక్షురాలు పొట్టేల కనక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.