🏠 telanganakeratam.in
Watermark
Clip Header Logo
Date of Publish : 11 November 2026, 9:08 pm Posted by : Kancharala Shivakumar

బయో మైనింగ్ తోనే చెత్తశుద్ధికరణ ప్రక్రియ.

News Image
దుబ్బాక ప్రతినిధి, నవంబర్ 11, తెలంగాణ కెరటం:బయో మైనింగ్ ప్రక్రియ ద్వారా డంపింగ్ యార్డ్ లో పేరుకుపోయిన చెత్తను శుద్ధికరణ చేపట్టినట్లు దుబ్బాక పురపాలక చైర్ పర్సన్ శ్రీరామ్ సంగీత రవీందర్ తెలిపారు. బుధవారం దుబ్బాక పురపాలక లోని లచ్చపేట శివారులో గల డంపింగ్ యార్డులో కోర్ బయో ఎనర్జీ వారి ఆధ్వర్యంలో చేపట్టిన బయో మైనింగ్ ప్రక్రియను పుర కమిషనర్ మహేష్ కుమార్ తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బయో మైనింగ్ ప్రక్రియలో వివిధ దశల్లో శుద్దీకరణ ప్రక్రియ ద్వారా పేరుకుపోయిన చెత్త, ఇతర వ్యర్థాలన్నీ తొలగిపోతాయన్నారు.ఈ ప్రక్రియలో వ్యర్థాలనుంచి వివిధ దశల అనంతరం వచ్చే బయో ఎరువు జీవ ఎరువుగా ఉపయోగపడుతుందన్నారు.స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా దుబ్బాకను పరిశుభ్రంగా, పర్యావరణ హితంగా, స్వచ్ఛ దుబ్బాకగా మార్చేందుకు ఈ ప్రక్రియను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బయోమైనింగ్ ప్రక్రియ పరిసరాల పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కీలక ముందడుగు అని పేర్కొన్నారు.పురపాలిక ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయకుండా తడి, పొడి చెత్తగా వేరుచేసి, పుర సిబ్బందికి అందించాలన్నారు.ఈ కార్యక్రమంలో పురపాలిక వైస్ చైర్మన్ ఆస సులోచన స్వామి , వార్డు కౌన్సిలర్లు బండి శ్రీలేఖ రాజు,శ్రీరామ్ సరస్వతి నరేందర్ , కోటగళ్ల రమ్య రాజేష్, తునికి సురేష్, ఎండి చాంద్ మియా, నాయకులు ఐరెని సాయి తేజ గౌడ్, పుర సిబ్బంది దిలీప్, కోర్ బయో ఎనర్జీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
🏠 Home