తిమ్మాపూర్ లో కేత్ బచావో అభియాన్
కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి నవంబర్ 12:నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కేత్ బచావో అభియాన్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇసందర్భంగామండలవ్యవసాయ శాఖ ఆదికారి హరీష్ కుమార్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయభూములప్రాముఖ్యత, భూమి పరిరక్షణ, సుస్థిర వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కేత్ బచావో అభియాన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో భాగంగా రైతులకు వ్యవసాయ భూముల సంరక్షణ, భూసార పరిరక్షణ, నేల కోత నివారణ, భూమిఆరోగ్యాన్నికాపాడుకోవడం మరియుభవిష్యత్ తరాలకు వ్యవసాయభూములనుఅందించడంయొక్కప్రాముఖ్యతను వివరించడం జరిగింది.రైతులు రసాయనఎరువులు,పురుగుమందులనుఅవసరమైన మేరకే వినియోగిస్తూ, సేంద్రీయ ఎరువులుమరియుపర్యావరణహిత వ్యవసాయ పద్ధతులను పాటించాలని సూచించడం జరిగింది. అలాగే ఎల్‌నినో ప్రభావంతో భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉన్నందున రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలని,జొన్న,పప్పుధాన్యాలు, నూనెగింజల వంటి ఆరుతడి పంటలను సాగు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలోమండల వ్యవసాయ శాఖ అధికారి హరీష్ కుమార్ , గ్రామ సర్పంచ్ నరేష్ ,వ్యవసాయ విస్తరణ అధికారి శ్రీలత మరియు రైతులు పాల్గొన్నారు.