మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య
మాలల హక్కుల సాధన సమితి తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకుడు బొమ్మల మైసయ్య ఆధ్వర్యంలో హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్ లో శ్రీ గడ్డం వివేక్ వెంకటస్వామి కార్మిక, ఉపాధి కల్పన, ఫ్యాక్టరీలు, మైనింగ్ మరియు భూగర్భ జలాల శాఖ మంత్రి గారిని కలిసి రోస్టర్ పాయింట్లను సవరించాలని రోస్టర్ విధానాన్ని సవరించే వరకు ఉద్యోగ నియామకాలను నిలిపివేయాలని అలాగే ఏడుపాయల వన దుర్గ ఆలయం వద్ద మాలలకు కమ్యూనిటీ హాల్ కావాలని అడగడంతో మంత్రి వివేక్ వెంకటస్వామి గారు కట్టిస్తామని మాటివ్వడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళితులపైన జరుగుతున్న దాడులను మంత్రిగారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఆయన వెంటనే స్పందించి ఉన్నంత అధికారులకు పోలీస్ శాఖ వారికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది,మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రతి మండలానికి అంబేద్కర్ భవన్ కేటాయించాలని,అంబేద్కర్ విగ్రహాలను పెట్టడానికి అనుమతులు ఇవ్వాలని అదేవిధంగా ప్రతి గ్రామాన ప్రజా యుద్ధ నౌక గద్దర్ విగ్రహాలను ఏర్పాటు చేయడానికి అనుమతులు ఇవ్వాలని కోరనైనది వీటికి అనుకూలంగా మంత్రి గారు స్పందించారు. ఈ కార్యక్రమంలో మాలల హక్కుల సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బొమ్మల మైసయ్య,మాలల హక్కుల సాధన సమితి రాష్ట్ర కార్యదర్శి బాల ఎల్లం, మాలల హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షులు పోతరాజు కుమార్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోరటి నాగరాజు,మెదక్ జిల్లా ఉపాధ్యక్షులు పాలేటి స్వామి, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాసాల విటల్,వెల్దుర్తి మండల అధ్యక్షులు నరసన్న గారి నర్సింహులు, మాసాయిపేట మండలం అధ్యక్షులు కత్తెర యాదగిరి, నార్సింగి మండల ఉపాధ్యక్షులు గర్జల స్వామి, రామాయంపేట మండలం ఉపాధ్యక్షులు జక్కుల శ్రీనివాస్, రామాయంపేట మండల అధ్యక్షులు దోసెల కార్తీక్,సివిల్ ఇంజనీర్ దొమ్మాట రవీందర్,నర్సాపూర్ తాలూకా అధ్యక్షుడు నీరుడు కృష్ణ,పాపన్నపేట మండల అధ్యక్షుడు బ్యాగరి లక్ష్మణ్, నాగసానిపల్లి సర్పంచ్ దండేపు దుర్గయ్య, చిన్న శంకరం పేట మండల ఉపాధ్యక్షులు కలకంటి బాబు, యూత్ సభ్యులు దుంపల యశ్వంత్, పోతరాజు నరేష్, గర్జల సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.